Attarintiki daredi release on aug 29th or 30th

Attarintiki Daredi starring Pawan Kalyan to release on Aug 29th or 30th

ఈనెల్లోనే పవన్ ‘అత్తారింటికి ’

Posted: 08/23/2013 11:37 AM IST
Attarintiki daredi release on aug 29th or 30th

గత కొన్ని రోజులుగా వాయిదాలు పడుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది ’ కోసం ఎదురు చూస్తున్నఅభిమానులకు ఇది ఖచ్చితంగా శుభవార్తే అవుతుంది. ఈ సినిమాను ఈనెల చివర్లో వారంలో అనగా 29, 30 వ తేదీల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటు ప్రకటన ప్రభావం స్టార్ హీరోల సినిమాల పై పడిన విషయం తెలిసిందే. గత ఇరవై రోజుల నుండి సీమాంధ్రలో ఉద్యమం జరుగుతుండటంతో ఉద్యం కాస్త చల్లబడిన తరువాత విడుదల చేద్దామని అనుకున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో ఎలాగైనా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. ఇక ఈ సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా పరిస్థితి ఇప్పుడు ఇంతే అని చెప్పడంతో నిర్మాత సైలెంట్ గా ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నాడని సమాచారం. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించే పవన్ కల్యాణ్ సినిమా ఇలా డిలే చేయడం వల్ల అందరికీ నష్టమే కాబట్టి విడుదల చేస్తేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడట. ఇక అబ్బాయి చరణ్ సినిమా ‘తుఫాన్ ’ సెప్టెంబర్  మొదటి వారంలో రావడానికి సిద్ధం అవుతుండటంతో ఈ లోపు ‘అత్తారింటికి దారేది ’ విడుదల చేస్తే నష్టం లేదని అభిప్రాయంతో ఉన్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles