Mahesh aagadu shoot starts from november

Mahesh Babu, Srinu Vaitla, Dookudu combination, Aagadu, Comedy entertainer, Mahesh Babu hit movies, Dookudu, Srinu Vaitla hit movies

Mahesh Babu, Srinu Vaitla, Dookudu combination, Aagadu, Comedy entertainer, Mahesh Babu hit movies, Dookudu, Srinu Vaitla hit movies

నవంబర్ నుండి మహేష్ ‘ఆగడు ’

Posted: 08/21/2013 12:48 PM IST
Mahesh aagadu shoot starts from november

మహేష్ బాబు ఇక ఆగనంటున్నాడు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కు ఈ మధ్య తెగ ఫాలోయింగ్ వచ్చింది జనాల్లో. ఎక్కడ చూసిన మహేష్ మేనియానే. ఇప్పటికే నెంబర్ వన్ ఇమేజ్ ఉన్న మహేష్ తనకున్న ఫాలోయింగ్, ఇమేజ్ తోనే ఆగడం లేదనకుంటే తప్పులో కాలేసినట్లే. విషయం ఏంటేంటే... ఈ హీరో శీనువైట్ల దర్శకత్వంలో ‘ఆగడు ’ అనే చిత్రంలో నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగు నవంబర్ నుండి ప్రారంభం కాబోతుంది. మొదట అనుకున్న ప్రకారం ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా, మహేష్ సుకుమార్ సినిమాలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ ను నవంబర్ నుండి ప్రారంభించబోతున్నారని అంటున్నారు. గతంలో వీరిద్దిరి కాంబినేషన్లో వచ్చిన ‘దూకుడు ’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ నమ్మకంతోనే మహేష్ ఈ సినిమాకు కమీట్ అయినట్లు చెబుతున్నారు.  14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. థమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles