Pawan gabbar singh 2 title registered

Powerstar, Pawan Kalyan, Gabbar Singh, Pawan Kalyan Gabbar Singh 2, Gabbar Singh sequel, Bengal Tiger, director Sampath Nandi, North Star Entertainment banner, Gabbar Singh 2 shooting, Gabbar Singh 2 heroine

Pawan Kalyan will begin shooting for Gabbar Singh sequel soon.

పవన్ అదే పేరుతో వస్తున్నాడు

Posted: 08/21/2013 05:57 PM IST
Pawan gabbar singh 2 title registered

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా సంవత్సరాల తరువాత భారీ విజయాన్ని అందించిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ‘రచ్చ ’ దర్శకుడు తెరకెక్కిస్తాడని, దానికి టైటిల్ ‘గబ్బర్ సింగ్ - 2’ పేరును ఖరారు చేసినట్లు వార్తలు వచ్చినా ఆ టైటిల్ హక్కులు కలిగి ఉన్న వారు గుడ్ విల్ కింద భారీ మొత్తం అడగటంతో ఆ పేరును మార్చేయాలని డిసైడ్ అయ్యి అనేక పేర్లను పరిశీలనలో ఉంచారు. అందులో ఒకటి ‘బెంగాల్ టైగర్ ’. ఈ పేరుతో పవన్ సినిమా ఉంటుందని అందరు భావించారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాకు అదే పేరుతో టైటిల్ ని రిజిష్టర్ చేయించారు. దానికి ముందు పవన్ పేరును జోడించి ‘పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ - 2’ గా రిజిష్టర్ చేశారు. ఇదే టైటిల్ ఫైనల్ అయిందని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో గతంలో కూడా ఇలానే ‘కత్తి ’ సినిమాకు ‘ఖలేజా ’సినిమాకు టైటిళ్ళ విషయంలో అభ్యంతరాలు వస్తే వారి పేర్లు జోడించి విడుదల చేశారు. ఇప్పుడు ‘గబ్బర్ సింగ్ - 2’ దర్శకుడు కూడా వారినే ఫాలో అయ్యాడని, గబ్బర్ సింగ్ పేరు మార్చి తీస్తే సినిమాకు క్రేజ్ తగ్గుతుందని భావించే ఇలా చేశారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles