Yevadu movie release date confirmed

Yevadu Movie Release Date Confirmed,

Yevadu Movie Release Date Confirmed,

అనుకున్న తేదీకే ఎవడు విడుదల

Posted: 07/16/2013 07:21 PM IST
Yevadu movie release date confirmed

రామ్ చరణ్ - వంశీ పైడిపల్లి - దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా ‘ఎవడు ’ విడుదల విషయం పై పూర్తి క్లారిటీ వచ్చింది. నిన్నటి వరకు ఈ చిత్రం పై రకరకాల వార్తలు ఫిలింనగర్ లో సంచరించాయి. కానీ ఆ చిత్ర నిర్మాత అయిన దిల్ రాజు ఈ రోజు ఈ సినిమా విడుదల పై అధికారిక ప్రకటన చేశాడు. మొదట ప్రకటించిన తేదీ జులై 31వ తేదీనే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని అన్నారు. ఈ తేదీలో ఎటువంటి మార్పులేదని తేల్చి చెప్పారు. నిన్నటి వరకు ‘ఎవడు ’ సినిమా జులై31 న కాకుండా ఆగష్టు రెండో వారంలో విడుదల చేస్తారని పవన్ సినిమా అత్తారింటికి విడుదల అయి , ఆ సినిమా రిజల్టు తరువాత దీన్ని విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బాబాయ్ పవన్ సినిమా ముందు విడుదల చేస్తే థియేటర్స్ సమస్య, కలెక్షన్ల పై ప్రభావం ఉంటుందని భావించి ఆ దిశగా ఆలోచించారని అన్నారు. కానీ చరణ్ ‘మధధీర ’ ఆ రోజునే విడుదల అయి రికార్డు విజయం దక్కడంతో ఇప్పుడు అదే సెంటిమెంటును ఫాలో అవుతున్నారని అంటున్నారు.  శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లగా నటిస్తున్నారు. అల్లు అర్జున్, కాజల్ గెస్ట్ పాత్రలు పోషించారు.. ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles