Salman khan speaks on suraj pancholi jiah khan relationship

jiah khan, suraj pancholi, salman khan, bollywood,

Suraj Pancholi mother has claimed that her husband Aditya Pancholi never asked superstar Salman Khan to intervene in Jiah Khan and Suraj relationship.

సల్లూభాయ్ కి సంబంధం లేదు

Posted: 06/17/2013 07:05 PM IST
Salman khan speaks on suraj pancholi jiah khan relationship

బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య వెనుక తన ప్రియుడు సూరజ్ పచోలి తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడనే వార్తలు బాలీవుడ్ సర్కిల్స్ లో చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో సినీ జనాలు అంతా షాక్ అయ్యారు. జియాఖాన్ ఆత్మహత్య తరువాత లభ్యమైన ప్రేమలేఖ తరువాత తన ప్రియుడే కారణమని తేలింది. దీంతో సూరజ్ పచోలిని అరెస్టు చేశారు. న్ని రోజుల క్రితం జియా ఖాన్ తల్లి రబియా మీడియాతో మాట్లాడుతూ, ‘సూరజ్ తండ్రి ఆదిత్య పంచోలి సూరజ్-జియా సంబంధం గురించి సల్మాన్‌కు చెప్పారు. అప్పుడు సల్మాన్ సూరజ్‌తో మాట్లాడారు. జియాకు దూరంగా ఉండాలని కోరాడు. కానీ సూరజ్ జియాను ప్రేమిస్తున్నానని చెప్పాడు' అని చెప్పుకొచ్చింది. అయితే రబియా వ్యాఖ్యలను సూరజ్ తల్లి జరీనా వాహెబ్ ఖండించారు. సల్మాన్ ఖాన్‌తో ఈ విషయం గురించి అస్సలు మాట్లాడలేదు, జియాకు దూరంగా ఉండాలని సల్మాన్ కోరలేదు. ఆమె ఇతర కారణాలతో డిస్ట్రబ్ అయిన విషయాన్ని నేను ఎప్పుడో గ్రహించాను. ఆమెతో రిలేషన్ వద్దని సూరజ్‌కు నేను చెప్పాను' అని వెల్లడించింది. దీంతో సల్మాన్ ఖాన్ హస్తం లేదని తేలడంతో జనాలు, ఆయన అభిమానులు ఊపిరి  పీల్చుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles