Bahubali movie title replaced mahabali

Prabhas, Rajamouli Movie Titled Mahabali?, Prabhas, Rajamouli Movie Titled Mahabali, prabhas mahabali movie, bahubali movie title replaced mahabali, rajamouli prabhas mahabali movie

Prabhas, Rajamouli Movie Titled Mahabali?, Prabhas, Rajamouli Movie Titled Mahabali, prabhas mahabali movie, bahubali movie title replaced mahabali, rajamouli prabhas mahabali movie

రాజమౌళి సినిమా పేరు మారింది

Posted: 05/20/2013 05:14 PM IST
Bahubali movie title replaced mahabali

టాలీవుడ్ లో ఓటమి అంటూ ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న సినిమా ‘బహుబలి ’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్టు చివరి వరకు వచ్చిన ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్లబోతుంది. అయితే రాజమౌళి ట్విట్టర్లో ప్రకటించిన ‘బహుబలి ’ పేరు మారిందని, ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని దీనికి అసలు టైటిల్ ని ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం. ఈ వార్తలకు బలం చేకూరే విధంగా ఆ చిత్ర నిర్మాత ఫిలిం చాంబరల్లో ‘మహాబలి ’ అనే టైటిల్ ని రిజిష్టర్ చేయించినట్లు, అదే టైటిల్ ని ఫైనల్ చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పటికే కీలక పాత్రల కోసం వివిధ భాషల నుండి మంచి నటుల్ని ఎంపిక చేసుకున్న రాజమౌళి ఇంకా కొన్ని పాత్రల కోసం నటుల్ని ఎంపిక చేస్తూనే ఉన్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సింథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles