Nagarjuna to buy autonagar surya

Nagarjuna to take-over Auto Nagar Surya, Nagarjuna to take-over Chaithu Auto Nagar Surya,Naga Chaitanya, Samantha, Autonagar Surya , Autonagar Surya movie, Nagarjuna, Deva Katta, R.R. movie makers,

Naga Chaitanya - Samantha starrer Deva Katta directorial film Autonagar Surya seems to be in deep trouble.

కొడుకు కోసం నాగార్జున రిస్క్ చేస్తున్నాడు

Posted: 04/17/2013 09:21 PM IST
Nagarjuna to buy autonagar surya

అక్కినేని కుటుంబం నుండి వారసత్వాన్ని పునికుపుచ్చుకొని తెలుగు ఇండస్ట్రీకి ‘జోష్ ’ సినిమాతో జోష్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా డిజాస్టర్ తరువాత ఏమాయ చేసావె, 100% లవ్ చిత్రాలతో తనకంటూ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న నాగచైతన్య ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో ‘ఆటో నగర్ ’ సూర్య చిత్రంలో నటిస్తున్న విసయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం నుండి జరుగుతున్నా ఇంత వరకు పూర్తి కాలేదు. కారణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నాగార్జున ‘ఢమరుకం ’ సినిమాతో భారీగా నష్టపోయి కష్టాల్లో పడటంతో ఈ సినిమాని పూర్తి చేయలేక మధ్యలో నిలిపి వేశారు. ఇక నాగచైతన్య సినిమాలు దీనికంటే ముందువి ఫ్లాఫులు కావడంతో ఎలాగైనా హిట్టుకొట్టాలనే తపన పడ్డాడు. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో నాగచైతన్య నిరాశ చెందుతున్నాడు. దీంతో కొడుకు కష్టాన్ని చూడలేక పోయిన నాగార్జున ఈ సినిమాను కొనుగోలు చేయబోతున్నాడని  సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ మరియు 10 రోజుల చిత్రీకరణ మిగిలి ఉన్న ఈ సినిమాను అదేస్థితిలోనే కొనుక్కుంటారట. కానీ సరైన ధర కుదరకపోవడం వల్ల కాస్త వెనుకడుగు వేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. చూద్దాం ఈ సినిమాని కొని నాగచైతన్య కెరీర్ ని ముందుకు నడిపిస్తాడో లేదో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles