Sreenu vaitla to write his own script for aagadu

Srinu Vaitla doing Script work alone for Aagadu, srinuvaitla, agadu, own script writing, kona venkat, gopi mohan, directors, mahesh

Telugu director Sreenu Vaitla, known for teaming up with Gopi Mohan to write scripts, is likely to go solo for his upcoming action-drama ‘Aagadu’.

సొంతంగా స్క్రిప్టు రాసుకుంటున్న శీను వైట్ల

Posted: 04/17/2013 02:31 PM IST
Sreenu vaitla to write his own script for aagadu

వరుస హిట్లతో దూసుకుపోతూ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా, తనదైన మార్క్ కామెడీని జోడిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ అలరిస్తున్న దర్శకుడు శీనువైట్ల ఇటీవల దర్శకత్వం వహించిన బాద్ షా సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇఫ్పుడు మహేస్ బాబుతో తన తరువాతి సినిమా కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు ఈయన ఆస్థాన రచయితలుగా చాలా కాలం నుండి ఉన్న గోపి మోహన్, కోన వెంకట్ బాద్ షా విషయంలో ఏదో చిన్న గొడవ వల్ల దూరం అయిన విషయం తెలిసిందే. దీంతో శీను వైట్ల తన తరువాతి సినిమాలకు ఆయనే స్క్రిప్టు రాసుకునే పనిలో పడ్డాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఈయన తన కెరియర్ ప్రారంభంలో నీకోసం, ఆనందం, సొంతం సినిమాలకు స్కిప్టు రాసుకొని సక్సెస్ అయ్యాడు. ఇన్నాళ్ళ తరువాత మళ్లీ తన రచనకు పదును పెట్టబోతున్నాడు. తన సొంత స్కిప్టు, దర్శకత్వ ప్రతిభతో మహేష్ ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి అంటున్నాు. ఇకపోతే కోన వెంకట్, గోపీ మోహన్ లు త్వరలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దం అవుతూనే, మరో వైపు తన రచనను కొనసాగించబోతున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న మల్టీస్టారర్ సినిమా కోసం వీరిద్దరూ స్కిప్టు అందించబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles