Sukumarudu movie firstlook responce

sukumarudu movie, sukumarudu movie firstlook, sukumarudu movie responce, hero aadi, rock star adi, lovely movie, nisha agarwal, nisha agarwal hot,krishna, sarada, bhavana, taagubotu ramesh,sukumarudu movie posters, sukumarudu movie teaser, movie news, film news

sukumarudu movie firstlook responce

17.gif

Posted: 01/31/2013 01:11 PM IST
Sukumarudu movie firstlook responce

su

       తన లవ్ లీ సినిమాతో  రాక్‌స్టార్‌ గుర్తింపుపొందిన ఆది హీరోగా 'సుకుమారుడు' త్వరలో ప్రేక్షకులముందుకు రాబోతోన్న సంగతి మనకు విదితమే. 'సుందరకాండ, కొండపల్లి రాజా' వంటి హిట్‌ చిత్రాల్ని నిర్మించిన సీనియర్‌ ప్రొడ్యూసర్‌ కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో శ్రీ సౌదామిని క్రియేషన్స్‌ పతాకంపై 'పిల్ల జమిందార్‌' దర్శకుడు అశోక్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది.  కె.వేణుగోపాల్‌ నిర్మాత.
          యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతోన్న 'సుకుమారుడు' మూవీ  ఫస్ట్‌ లుక్‌ కు మంచి స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. మిగిలిన ఒక పాటను ఫిబ్రవరి 10 నుంచి ఐదు రోజులపాటు చిత్రీకరించడం జరుగుతుంది. దీంతో మొత్తం షూటింగ్‌ పూర్తవుతుంది. ఫిబ్రవరిలో ఆడియో, మార్చిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
         కాగా, ఆది, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా కావటం విశేషం. దాదాపుగా తెలుగు ఇండిస్టీలో వున్న 60, 70 మంది ఆర్టిస్టులు అందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ కృష్ణ, ఊర్వశి శారద కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు కీలకం అని తెలుస్తోంది. నిషా అగర్వాల్‌, భావన అందచందాలు  ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్‌ అవుతాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.         ఫారిన్‌లో చిత్రీకరించిన పాటలు, ఫైట్‌ మాస్టర్‌ రవివర్మ కంపోజ్‌ చేసిన మూడు ఫైట్లు.. మైలవరంలో చిత్రీకరించిన క్లైమాక్స్‌ ఫైట్‌ బాగా వచ్చాయని సమాచారం.

aa
       ఆది, నిషా అగర్వాల్‌, భావన ముఖ్య పాత్రలో ఊర్వశి శారద, ఓ ప్రత్యేక పాత్రలో సూపర్‌స్టార్‌ కృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో ఎం.ఎస్‌.నారాయణ, తనికెళ్ళ భరణి, రావు రమేష్‌, చలపతిరావు, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, తిరుపతి ప్రకాష్‌, సంజరు, తాగుబోతు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
          ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: శ్రీరామ్‌, ఎడిటింగ్‌: ప్రదీప్‌, ఆర్ట్‌: రామ్‌, డ్యాన్స్‌: 'జులాయి' శేఖర్‌, కో-ప్రొడ్యూసర్‌: బాబ్జీ, సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ, నిర్మాత: కె.వేణుగోపాల్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: అశోక్‌ జి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dandupalyam movie success meet
Race movie release date conform  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles