Ram charan nayak movie teaser release

ram charan nayak,nayak movie, nayak movie teaser, nayak movie teaser release, vv vinayak, kajal, ram charan, nayak stills, nayak teaser, nayak wallpapers, nayak promos, director vv vinayak, producer dvv danaiah, nayak track list, nayak songs

ram charan nayak movie teaser release

27.gif

Posted: 12/15/2012 04:03 PM IST
Ram charan nayak movie teaser release

nn

       కొద్దిసేపటిక్రితం 'నాయక్' టీజర్ విడుదలైంది మొదలు.. కేక, బీభత్సం, అదుర్స్.. అంటూ తెలుగువిశేష్.కాం కు కుప్పతెప్పలుగా మెసేజెస్ వచ్చిపడుతూ ఉన్నాయి. హైదరాబాద్-నానక్ రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో ఈ నెల 17 వ తేదీన అంగరంగ వైభవంగా పాటల పండుగ నిర్వహిస్తున్న నేపథ్యంలో విడుదల చేసిన ఈ టీజర్  వచ్చిందేతడవుగా అభిమానుల హృదయాలలోకి చొచ్చుకుపోతోంది. 30 సెకండ్ల నిడివితో సాగిన ఈ టీజర్ని యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేశారు. పక్కా మాస్ స్టయిల్ నిండిన యాక్షన్ హీరోగా చరణ్ ని,  వివి వినాయక్  అద్భుతంగా చూపించాడు.  దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయని మార్కెట్ వర్గాలంటున్నాయి.

         ఇదిలా ఉండగా, ‘నాయక్’ మూవీలోని పాటల్లో కూడా ప్రయోగం కనిపిస్తుంది. ఈ సినిమాలోని ఓ పాటను తెలుగు ... హిందీ పదాలను మిక్స్ చేసి రాయడం జరిగింది. '' హే నాయక్ ... తూ హే లవ్ నాయక్, తుజ్ సే దిల్ డోలక్ ... దిల్ ధన్ .. ధన్ ..ధన్  బీట్ మారే''! అనే వరుసలతో ఈ పాటను కంపోజ్ చేశారు.  శ్రేయా ఘోషాల్ ... నవీన్ మాధవ్ పాడిన ఈ పాట యువతను ఉర్రూతలూపడం ఖాయమని అంటున్నారు.
     ఈ సుభసందర్భంలో  ‘నాయక్’ ట్రాక్ లిస్ట్ మీకోసం.
1.    లైలా ఓ లైలా
      సింగర్స్ : శంకర్ మహదేవన్, రంజిత్, రాహుల్, నవీన్
2.    కత్తిలాంటి పిల్లా
      సింగర్స్ : తమన్, శేఫాలి అల్వారిస్
3.   శుభలేఖ రాసుకున్నా
     సింగర్స్ : హరిచరణ్, శ్రేయ ఘోషల్
4.    ఒక్క చూపుకే పడిపోయా
     సింగర్స్ : విజయ్ ప్రకాష్, బిందు మహిమ
5.     నెల్లూరే
     సింగర్స్ : జస్ప్రీత్, సుచిత్ర
6.     హే నాయక్
       సింగర్స్ : శ్రేయ ఘోషల్, నవీన్ మాధవ్

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saarocharu release date conform
Telugu viswaroopam release postpone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles