Telugu viswaroopam release postpone

kamal hassan viswaroopam, telugu viswaroopam release, kamal hassan viswaroopam postpone, telugu version, kamal hassan movies, viswaroopam movie, viswaroopam wallpapers, viswaroopam teaser

telugu viswaroopam release postpone

21.gif

Posted: 12/15/2012 01:01 PM IST
Telugu viswaroopam release postpone

vis_in

        భారతీయ చలన చిత్ర సంచలనం కమలహాసన్ తన  విశ్వరూపదర్శనాన్ని తెలుగు ప్రేక్షకులకు వాయిదా వేశాడు. ఫలితంగా అతని ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వరూపం' విడుదల మళ్ళీ వాయిదా పడింది. అయితే, ఇది తెలుగు వెర్షన్ కే పరిమితం. తమిళ, హిందీ వెర్షన్లు మాత్రం మొదట్లో ప్రకటించినట్టు సంక్రాంతికి విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన పనలు చకచకా సాగిపోతున్నాయి.
          అయితే, 'విశ్వరూపం' తెలుగు వెర్షన్ విడుదలవాయిదాకి ఇతర సినిమాల తాకిడే కారణమని సమాచారం. తెలుగు అగ్రహీరోల చిత్రాలైన వెంకటేష్, మహేష్ కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్ చరణ్ నటించిన 'నాయక్' సినిమాలు సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల అవుతున్నందున, వాటితో పోటీ పడడం శ్రేయస్కరం కాదని కమల్ భావించటం వల్లే వాయిదా అనివార్యమైంది.
           అంతేకాదు ఆల్రెడీ సీవాసిచె, నాయక్ సినిమాలకు మంచి ధియేటర్లు బుక్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో సంయమనం పాటించి వెనకడుగేయటమే ఉత్తమమని కమల్ నిర్ణయించుకున్నారు. కాగా, ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు  ఎప్పుడు వచ్చేదీ అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan nayak movie teaser release
Kareena kapoor remuneration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles