Ko ante koti movie audio release

ko ante koti movie audio, ko ante koti movie audio release,ram charan, ramcharan, srihari, sharwanand, ko ante koti wallpapers, ko ante koti teaser, priya anand, hot priya anand,

ko ante koti movie audio release

20.gif

Posted: 12/09/2012 03:29 PM IST
Ko ante koti movie audio release

Ko_Ante_Koti_11

          శర్వానంద్ మరియు ప్రియ ఆనంద్ ప్రధాన పాత్రలలో రూపుదిద్దుకున్న ‘‘కో అంటే కోటి’’ ఆడియో ఫంక్షన్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూసాయి. రాత్రి హైటెక్స్ జరిగిన కో అంటే కోటి ఆడియో వేడుకకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఆడియో ఆవిష్కరించి చక్కటి ప్రసంగంతో అందరినీ అలరించారు. 'మగధీర' సినిమాలో షేర్ ఖాన్ పాత్ర చేసిన ప్రముఖ నటుడు శ్రీహరి మళ్లీ చరణ్ సినిమాలో నటించబోతున్నానంటూ ఈ ఆడియోవేడుక సాక్షిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.  అవును... చరణ్ కథానాయకుడుగా నటిస్తున్న 'జంజీర్' సినిమాలో షేర్ ఖాన్ పాత్ర వుంది. ఈ సినిమా హిందీ వెర్షన్లో ఆ పవర్ ఫుల్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా... తెలుగు వెర్షన్లో శ్రీహరి పోషిస్తున్నారు.

Ko_Ante_Koti_1
     ఇదిలా ఉంటే,  చాలా అట్టహాసంగా జరిగిన కో అంటే కోటి ఆడియో విడుదల కార్యక్రమానికి పలువురు నటులు, దర్శకులు నిర్మాతలు హాజరయ్యారు.  పైరసీ ని అరికట్టడానికి ఈ చిత్ర బృందం సోషల్ నెట్ వర్క్ సైట్స్ లో పాటలను అధికారికంగా విడుదల చేశారు. అనిష్ కురువిల్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సర్వా ఆర్ట్స్ బ్యానర్ మీద శర్వానంద్ నిర్మించారు. శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందించగా ఎరుకేల్ల రాకేశ్ మరియు నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.
       ఇంకా,  ఎస్ గోపాల్ రెడ్డి, బి గోపాల్, స్రవంతి రవికిషోర్, శ్రీహరి, శివ బాలాజి, నవదీప్ సందీప్ కిషన్, దేవ కట్ట, శేఖర్ కమ్ముల మరియు కమల్ కామరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hemachandra and sravana bhargavi got engaged
Puri jagannadh with salmankhan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles