Pawan kalyan trivikram movie updates

pawan kalyan, trivikram,pawan trivikram movie updates, pawan movie news, trivikram srinivas, spain, spain tour, devi sriprasad, pawan trivikram movie launch, pawan trivikram movie launch pics, pawan remuneration, trivikram remunaration

pawan kalyan trivikram movie updates

18.gif

Posted: 12/08/2012 06:54 PM IST
Pawan kalyan trivikram movie updates

pawa_trie      ప్రస్తుతం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  రూపుదిద్దుకోబోతోన్న సినిమాలో పవన్ పాత్ర గురించీ, ఈ సినిమా చిత్రీకరణ గురించి చాలా ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. వీటికి ఊతమిస్తూ.. పవన్ కల్యాణ్ అతని టీం స్పెయిన్ వెళ్లబోతున్నారు. స్పెయిన్ దేశమన్నా, స్పానిష్ భాష అన్నా పవన్ కి చాలా ఇష్టం. గతంలో 'బద్రి' సినిమాలో (చికీతా), 'తీన్ మార్' సినిమాలో కూడా పవన్ కొన్ని స్పానిష్ పదాలు ప్రయోగించి ఆ భాష పట్ల తన అభిమానాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. బార్సిలోనాకి పవన్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా వెళుతున్నారు. షూటింగు లొకేషన్లతో బాటు, మ్యూజిక్ సిట్టింగులు కూడా అక్కడ నిర్వహిస్తారని సమాచారం.  

pawan-trivikram-movieee

        ఇక పాత్ర గురించి చెప్పాలంటే... ఇందులో ఆయన మల్టీ మిలియనీర్ (కోటీశ్వరుడు) పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే, లుక్ లోగానీ... కాస్ట్యూమ్స్ విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటున్నారు. కాస్ట్యూమ్స్ అన్నీ చాలా రిచ్ గా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా టైటిల్ గురించి కూడా గట్టి కసరత్తే చేస్తున్నారు. క్యాచీగా ఉండేలా... పవన్ ఇమేజ్ కి సూటయ్యేలా టైటిల్ పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా 'సరదా'... 'దోబూచులాట'... 'అద్వితీయం' అనే పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri jagannadh with salmankhan
Mani ratnam movie kadal audio  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles