డుం..డుం.. డుబుక్కు... డుం..డుం..డుబుక్కు... ‘ఏ..డే.. ఏడేడే...వయ్యారి వరుడు....,’ అనాలన్నా, సెప్టెంబర్ మాసం.. సెప్టెంబర్ మాసం... అనాలన్నా మణిరత్నంకే చెల్లు. అతని సినిమాకే కాదు, కేవలం పాటలకే పడిచచ్చే జనాలు ఎంతోమంది. ఈ దర్శక దిగ్గజం నుంచి ఎట్టకేలకు రాబోతున్న చిత్రం ‘కడల్’. ఈ మూవీ చిత్ర ఆడియో విడుదల తేదీ ఇవాళ ప్రకటించారు. ఆడియో డిసెంబర్ 17న విడుదల కానుంది.
ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అశేష స్పందన వస్తోంది. ఘర్షణ హీరో కార్తీక్ కొడుకు గౌతం, రాధా చిన్న కూతురు తులసి ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కాబోతుండటం విశేషం. జాలర్ల బ్రతుకుల కథాంశంతో సాగే టీనేజ్ ప్రేమ కథ ఇది. లక్ష్మి మంచు మరియు అరవింద్ స్వామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత నెల ఈ చిత్రంలోని ‘నెంజికుల్లె’ అనే పాటను ఏ ఆర్ రెహమాన్ MTV లో విడుదల చేసినప్పుడు విశేష స్పందన వచ్చింది. ఇదే కోవలో మచ్చుకి డిసెంబర్ 10న ‘ఏలే కీచన్’ అనే పాటను విడుదల చెయ్యనున్నారు.
రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ, ఎ ఆర్ రహమాన్ సంగీతం పీక్ స్టేజ్ లో ఉంటుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more