Gabbar singh 3 coming soon charans movie update

pawan kalyan, pawan gabbar singh,gabbar singh 3, sequel for gabbar singh, teaser, wallpapers, charan, zangeer, pawan updates, charan updates, coming soon, charan's movie update

gabbar singh 3 coming soon, charan's movie update

19.gif

Posted: 11/17/2012 06:18 PM IST
Gabbar singh 3 coming soon charans movie update

Gabbar_Singh

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్.  హీరోగా 'గబ్బర్ సింగ్' బ్లాక్ బస్టర్ సినిమా నిర్మించిన పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేష్, దీనికి సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకోసం 'గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్' అనే టైటిల్ని ఆయన ఫిలిం చాంబర్లో తాజాగా రిజిస్టర్ చేశాడు. ఇప్పుడు హిందీలో రూపొందుతున్న 'దబాంగ్ 2' చిత్రం ఆధారంగా ఇది రూపొందుతోన్న సంగతి మనకు తెలుసు. ఈ సినిమాలో గబ్బర్ సింగ్ అంత్యాక్షరి సీన్ కూడా వాడుతున్నారు.
          అంతేకాదు ఇందులో నటించడానికి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే, దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారన్నది మాత్రం సస్పెన్స్ గా వుంది. ఓ నూతన దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తాడన్న ప్రచారం కూడా జరుగుతోంది!

charan_new_pic
      ఇదిలా ఉంటే బాబాయ్ విలన్ తో అబ్బాయ్ రామ్ చరణ్ కూడా కత్తి దూస్తున్నాడు. చరణ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'జంజీర్' దర్శకుడు అపూర్వ లఖియా మరో కీలకమైన పాత్ర కోసం 'అతుల్ కులకర్ణి'ని ఎంపిక చేశారు. గతంలో 'పంజా' చిత్రంలో నటించిన అతుల్ కులకర్ణి, 'జంజీర్' కోసం తనని ఎంపిక చేసిన విషయం నిజమేనంటూ తన ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించాడు.  'జంజీర్' చిత్రంలో తాను ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాననీ, తన పాత్రని దర్శకుడు అద్భుతంగా మలిచాడని చెప్పాడు. విభిన్నమైన ఈ పాత్ర తనకి దక్కడం అదృష్టమనీ, ఈ సినిమాతో తన క్రేజ్ మరింత పెరగడం ఖాయమని అన్నాడు.
      రామ్ చరణ్ - ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడి గుర్రపుశాలల్లో నాయకా నాయికలపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సంజయ్ దత్ - ప్రకాష్ రాజ్ ప్రధాన  పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rana dabbugati living style
Mahesh babu sukumar new movie tuntari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles