Chammak challo aduio launching function

chammak challo, chammak challo movie, chammak challo aduio, audio launching function, varun dandesh, actress sanchita padukune wallpapers, teaser

chammak challo aduio launching function

5.gif

Posted: 11/12/2012 02:01 PM IST
Chammak challo aduio launching function

Chammak_Chall_inneee

శ్రీశైలేంద్ర సినిమా పతాకంపై డి.యస్‌.రావు సమర్పణలో మాస్టర్‌ బుజ్జిబాబు నిర్మిస్తున్న చిత్రం 'చమ్మక్‌ చల్లో'. జాతీయ అవార్డ్‌ గ్రహీత నిలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్‌సందేశ్‌ కథానాయకుడు. సంచిత పడుకునె, కేధరిన్‌లు నాయికలుగా పరిచయమవుతున్నారు.కిరణ్‌ వారణాసి సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
        ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా తమ్మారెడ్డి భరద్వాజ్‌, విజయసారధి, సంపత్‌ నంది, దామోదరప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల, వి.ఎన్‌.ఆదిత్య, త్రినాదరావు, నక్కిన, డి.కృష్ణరావు (డి.యస్‌.రావు తండ్రి) పాటు చిత్ర బృందం హజరయ్యారు. బిగ్‌ సిడిని దర్శకుడు సంపత్‌ నంది ఆవిష్కరించి, చిత్ర కథానాయకులు సంచిత పడుకునె, కేధరిన్‌లకు అందజేశారు. ఆడియో సిడిలను సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ ఆవిష్కరించి, వి.ఎన్‌.ఆదిత్యకు ఇచ్చారు.
       తమ్మారెడ్డి భరద్వాజ్‌ మాట్లాడుతూ తెలుగు ఇండిస్టికి నేషనల్‌ అవార్డ్‌ సినిమాలు తీసే దర్శకులు కరువయ్యారు అనే సమయంలో నీలకంఠ అవార్డ్‌ సినిమాలను మన ఇండిస్టికు అందించారు. అవార్డ్‌ దర్శకులు ఉన్నారు అని నిరూపించా రాయన. పర్‌పస్‌ లేని చిన్న సినిమాలొస్తున్న నేపథ్యంలో పిల్ల జమీందారు అనే సినిమాతో డి.ఎస్‌.రావు ఫామ్‌లోకి వచ్చారు. వారసులే కాదు ఏ బ్యాగ్రౌండ్‌ లేని వారు కూడా హీరోలుగా నిలబడతారు అని వరుణ్‌ సందేశ్‌ నిరూపించారు. వీరు ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను అని అన్నారు.
       దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ నేను సినిమా కథ చెప్తాను అంటే ఏ రోజు కూడా నిర్మాత కథ వినలేదు. మీరు సినిమా తీయండి. నాకు మీ మీద నమ్మకం ఉంది అని బాధ్యతను నా మీద పెట్టారు. నేను మొదటి సారి ట్రై చేసిన లవ్‌ ఎంటర్‌టైనర్‌ ఈచిత్రం. ఓ సందర్భంగా వరుణ్‌ ఫాదర్‌ విజయసారధిని కలిసినప్పుడు కథ విని ఈ టైటిల్‌ను సూచించారు. చాలా ఆలోచించాను. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రానికి 'చమ్మక్‌ చల్లో'టైటిల్‌ కథానుగుణంగా నప్పుతుందని అదే టైటిల్‌ను ఖరారు చేశాము. కిరణ్‌ వారణాసి సంగీతం సారధ్యంలో పాటలన్ని బాగా కుదిరాయి. వరుణ్‌ కూడా ఈ చిత్రంలో ఓ పాట పాడాడు. మ్యూజిక్‌ ఈ చిత్రానికి మరింత బలానిస్తుంది అన్నారు.
       వరుణ్‌సందేశ్‌ మాట్లాడుతూ నీలకంఠగారి కాంబినేషన్‌లో పనిచేయడం డిఫరెంట్‌ ఎక్స్‌పిరియన్స్‌ నిచ్చింది. హ్యాపీడేస్‌ తరువాత అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న చిత్రమిది. ఆయనతో వర్క్‌ చేసినన్ని రోజులు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. ఆయన డెడికేషన్‌ బాగా నచ్చింది. ప్రతి విషయంలోను చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రమాదేవిగారు నన్ను చాలా స్టైలిష్‌ డిజైన్‌ చేశారు. తప్పకుండా ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని వెల్లడించాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress sriya sharan activities
Shankar new movie i expences  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles