అమ్మాయిలు, దర్శక నిర్మాతలే కాదు సగటు ప్రేక్షకుడు కూడా అనేమాట... అందం..అభినయం కలిస్తే శ్రియ అని. అయితే ఈమె గురించి చాలా మందికి తెలియని సంగతేంటంటే.. తనకి చేతనైనంత సాయం చేసే మంచి గుణం కూడా ఆమెలో ఉంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రియ, ప్రతిభ, పట్టుదలతో సాధారణ అమ్మాయి అనే స్థాయి నుంచి సినిమా హీరోయిన్గా ఎదిగింది. తన అదృష్టానికి అహంకారాన్ని అంటనివ్వకుండా, సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తోంది. అంధులకు, అనాథలకు, అభాగ్యులకు తన పారితోషికంలో కొంత భాగాన్ని కేటాయిస్తూ ఉంటోంది. ఈ విషయంలో ఆమె తనతోటి కథానాయికలకు స్ఫూర్తిగా నిలుస్తోంది కూడా.. అంతేకాదు పర్యావరణ పరిరక్షణపై కూడా శ్రియకు మంచి అవగాహన ఉంది. పర్యావరణానికి హాని కలిగించే ఏ పనిని ఆమె చేయదు. మరొకరిని ప్రోత్సహించదు. అందుకే 'దీపావళి' పండుగ రోజున దీపాలు వెలిగిస్తాను కానీ టపాసులు మాత్రం కాల్చనని, ఈ విషయానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా తాను ఎక్కువగా పాల్గొంటూ ఉంటానని ఆమె చెబుతోంది. ఇదంతా తెలిశాక శ్రియ కన్నా ఆమె మనసు మరింత అందంగా కనిపిస్తోంది కదూ..
ఇక ఈ సౌందర్య మనస్వి వెండితెర ఎంట్రీ అనుకోకుండా జరిగిందే.., డిగ్రీ చదువుతోన్న సమయంలో 'ఇష్టం' సినిమాలో అవకాశం రావడంతో, ఆ ఒక్క సినిమా చేసేసి, మానుకుందామని శ్రియ అంగీకరించిందట. ఆ తర్వాత 'సంతోషం' సినిమాలో అవకాశం రావడంతో, పెద్ద బ్యానర్ కదా చేసి చూద్దామని అనుకుని గ్రీన్ సిగల్ ఇచ్చింది. కానీ ఈ సినిమా తర్వాత ఆమె కథానాయికగా ఇక వెనుతిరిగి చూసుకోలేదు. అలా అంచలంచెలుగా ఎదిగిన శ్రియ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. దీపావళి పండుగ సందర్భంగా అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతోంది శ్రియ శరణ్.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more