Rajamouli working on story for prabhas

Rajamouli has come back from his vacation and he is now working on coming up with an innovative story line for Prabhas. Action, entertainment and high voltage drama will be integral parts of the subject and shooting will begin once the script work is complete

Rajamouli has come back from his vacation and he is now working on coming up with an innovative story line for Prabhas. Action, entertainment and high voltage drama will be integral parts of the subject and shooting will begin once the script work is complete

Rajamouli working on story for Prabhas.png

Posted: 08/25/2012 08:03 PM IST
Rajamouli working on story for prabhas

Rajamouli_Prabas

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల తీసిన ఈగ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా యాభై రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం సంవత్సరం పాటు తీరిక లేకుండా కష్టపడిన రాజమౌళి ఈ సినిమా విజయాన్ని ఆస్వాదించడానికి ఫ్యామిలీతో కలిసి గోవా ట్రిప్ వేసి తిరిగి వచ్చారు. ఇప్పడు తన తరువాత చిత్రానికి సంబంధించిన పనులు మొదలు పెట్టినట్లు సమాచారం. తన తరువాత సినిమా ప్రభాస్ తో తీయబోతున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్ర్కిప్టు పూర్తయింది. హై ఓల్టేజ్ తో కూడిన యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, డ్రామాతో ఈ చిత్రం ఉండబోతుందట. ఈ సినిమాని ముఖ్యంగా మూవీ లవర్స్‌కి సరికొత్త అనుభూతి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా లో ప్రభాస్ ప్రక్కన మెయిన్ హీరోయిన్ శృతి హాసన్, సెకండ్ హరోయిన్ గా అందాల రాక్షసి చిత్రంలో తన నటనతో రాజమౌళిని ఆకట్టుకున్న లావణ్య త్రిపాటిని పెట్టుకోబోతున్నట్లు వార్తలు. ఈచిత్రాన్ని ఆర్కా మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ పంజా చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ప్రభాస్-రాజమౌళిల చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సాధ్యమైనంత త్వరలో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana realised i want to get some weight back
Harry nude behaviour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles