57th birthday wishes to chiranjeevi

Chiranjeevi Birthday, Megastar, Praja Rajyam party, Politics, entry, merger, ramcharan, bollywood, Happy 150th picture, Happy Birthday

Actor-turned-politician, Chiranjeevi, referred as ‘Megastar’, turns 57 on August 22, 2012.Chiranjeevi was born in 1955 to Konidela Venkat Rao and Anjana Devi in Mogultoor.Chiranjeevi married Surekha, daughter of Telugu actor Allu Rama Lingaiah in 1980. His son Ram Charan is also a Tollywood actor,and is all set to make Hindi debut with ‘Zanjeer’.

57th Birthday Wishes to Chiranjeevi.png

Posted: 08/22/2012 03:26 PM IST
57th birthday wishes to chiranjeevi

Chiru

తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళలో చిరంజీవి ఒకరు. ఇంటి పెద్ద కొడుకు అంటేనే తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు. కష్టపడి పైకి వచ్చి తన కాళ్ళ మీద తాను నిలబడటమే కాకుండా... తన కుటుంబానికే మార్గదర్శకుడవడమేగాక... ఆంధ్ర రాష్ట్రంలోనే అనంత కోటి అభిమానులను సంపాదించుకుకొని మెగాస్టార్ గా ఎదిగిన ఏకైక హీరో ఆయన.  నేటితో ఆయన 56 సంవత్సరాలు పూర్తి చేసుకుని 57వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు.చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 1978 లో 'పునాదిరాళ్ళు' చిత్రంతో నటుడిగా తన కెరియర్ కు పునాది వేసుకున్నారు.

ఆ తరువాత  'ఇది కథ కాదు' , 'పున్నమి నాగు' వంటి చిత్రాల్లో నెగిటివ్ కేరక్టర్లు చేసి మెప్పించారు. అలా అవకాశాలను అందిపుచ్చుకుంటూ వెళుతోన్న చిరంజీవి కెరియర్ ను 1980 ప్రధమార్ధంలో వచ్చిన 'అభిలాష', 'గూండా', 'ఖైదీ','ఛాలెంజ్' చిత్రాలు అనూహ్యమైన మలుపు తిప్పాయి. ఆ తరువాత నుండి చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో స్రుష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇటు యాక్షన్, రొమాంటిక్ చిత్రాలు చేస్తూనే మరో ప్రక్క సమాజానికి అవసరమయ్యే సందేశాత్మక సినిమాలు తీసి ప్రజల్లో చైతన్యం కల్గించాడు. ఇలా తెలుగు సినిమాను ఆన్ని విషయాల్లోనూ అన్ని వైపులా నుంచి తనదైన శైలిలో ప్రభావితం చేసిన చిరంజీవిని 'పద్మ భూషణ్' వరించింది.  సినిమాలోకంలోనుండి రాజ‌కీయాల్లోకి వెళ్ళి అక్కడ కూడా త‌న‌దైన ముందుకు ప‌య‌నిస్తూ  రాష్ట్ర్ర రాజ‌కీయాల‌లో ఒక బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎద‌గ‌డానికి ముందుకు సాగుతున్న చిరంజీవి మరిన్ని పుట్టిన రోజులు జరపుకోవాలని ఆంధ్రవిశేష్ కోరుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala akkineni at life is beautiful
Chiru compliments for banny  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles