Chiru compliments for banny

chiru compliments for banny

chiru compliments for banny

19.gif

Posted: 08/21/2012 08:39 PM IST
Chiru compliments for banny

       chiru_eeఅల్లు అర్జున్ - ఇలియానా జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన pawan_e'జులాయి' మూవీ బన్నీకెరీర్ లో నూతన రికార్డులకు నాంది పలికింది. తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంపర అప్రతిహతంగా కొనసాగుతోంది. విడుదలై రెండు వారాలు కావొస్తున్నా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకపోవడం బన్నీకి మరింత ఆనందాన్ని ఇవ్వటమేకాక, అతని అభిమానులను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా, రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్న కారణంగా ఈ సినిమాని మొన్నటి వరకూ చిరంజీవి చూడలేదు. దాంతో అందరూ మెచ్చుకుంటున్నా ఆ సినిమా చిరంజీవి చూడలేదనే అసంతృప్తి అల్లు అర్జున్ ని వెంటాడిందట. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలై రెండు వారాలు కావొస్తుండటంతో, చిరంజీవి స్పెషల్ షో వేయించుకుని చూశారు. ఈ సినిమా చూసిన చిరంజీవి, గతంలో కంటే అల్లు అర్జున్ ఈ సినిమాలో మెరుగైన నటనని కనబరిచాడంటూ అతన్ని అభినందించాడట. ఆ కాంప్లిమెంట్ కోసమే ఎదురు చూస్తోన్న అల్లు అర్జున్, వెంటనే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.
     ఇదిలా ఉండగా, మెగా అభిమానులకు మరో శుభవార్త. పవన్ కల్యాణ్ 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమా అనుకున్న సమయం కంటే ఓ వారం ముందుగా అంటే, అక్టోబర్ 11 న విడుదల కానుంది. మొదట్లో ఈ సినిమాని అక్టోబర్ 18 న విడుదల చేస్తామని దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రకటించారు. అయితే, నిర్మాణ కార్యక్రమాలు మరింత త్వరగా పూర్తి కావస్తున్నందున విడుదల తేదీని ఓ వారం రోజులు ముందుకి తెచ్చారు. గతంలో 'బిజినెస్ మేన్' సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమాని జనవరి 14 న విడుదల చేస్తామని ముందుగా ప్రకటించి, చివరికి జనవరి 11 నే విడుదల చేశారు. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  57th birthday wishes to chiranjeevi
Baja bajantreelu latest movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles