Bumper collections for julayi

bumper collections for julayi

bumper collections for julayi

25.gif

Posted: 08/14/2012 09:15 PM IST
Bumper collections for julayi

       స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన స్టైలిష్ ఎంటర్టైనర్ మూవీ ‘జులాయి’. ఈ చిత్రం విడుదలైన అన్ని julayi_eఎరియాల్లోనూ మంచి కలెక్షన్లు రాబట్టుకుంటోంది. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. నైజాంలో ఈ చిత్రం మొదటివారం సుమారు 7 కోట్ల పైనే షేర్ సాదించేలా ఉంది. ఈ చిత్రం విడుదలైన చాలా కేంద్రాల్లో ఎంతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు కనుక ఈ చిత్ర కలెక్షన్లకు ఎలాంటి డోఖా ఉండదు. ఈ చిత్రం ఇలాగే ఎక్కువ కేంద్రాల్లో మరికొన్ని రోజులు ప్రదర్శించబడితే ‘జులాయి’ చిత్ర నిర్మాతలకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ‘జులాయి’ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇకముందు కూడా బాక్స్ ఆఫీసు దగ్గర ఎలాంటి కలెక్షన్ల రికార్డు సృష్టించనుందనే దాని కోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ కామెడీ, పంచ్ julayi_eeడైలాగ్స్ ,అల్లు అర్జున్ స్టైలిష్ డాన్సులు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయ్యాయి. గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డి.వి.వి దానయ్య సమర్పణ.
      ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ హీరోగా ఓ త్రిభాషా చిత్రం తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. ఇటీవల తమిళ ... మలయాళ భాషల్లోకి విడుదలైన అల్లు అర్జున్ సినిమాలు అక్కడ ఘన విజయాలను సాధించాయి. దాంతో అక్కడ ఆయన చిత్రాలకి మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే లింగుస్వామి బన్నీని కథానాయకుడిగా ఎంచుకుని ఓ విభిన్న కథాంశాన్ని తెరకెక్కించనున్నాడని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Moksshajna debue in tollywood balakrishna
Balakrishna dream project coming soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles