Balakrishna dream project coming soon

balakrishna dream project coming soon

balakrishna dream project coming soon

27.gif

Posted: 08/14/2012 09:02 PM IST
Balakrishna dream project coming soon

       నందమూరి నటసింహం.. నట బెబ్బులి.. బాలయ్య బాబు కలల సౌధం నిర్మితం కానుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావుతో balayyaకలిసి ఈ ప్రాజక్టును రూపుదిద్దుకోబోతోంది. అహో.. ఆంధ్ర భోజ శ్రీ కృష్ణదేవరాయలు చరిత్ర మీద వీరిరువురి కాంబినేషన్లో ఒక చిత్రం చేయనున్నారు. సాంప్రదాయ మరియు పౌరాణిక పాత్రలు చేయడంలో బాలకృష్ణ సిద్ద హస్తుడు మరియు ఆయన ‘ఆదిత్య 369′ సినిమాలో చేసిన శ్రీ కృష్ణదేవరాయలు పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సంగతి మనకకెరుకే.. ప్రస్తుతం రాఘవేంద్ర రావు ఈ చిత్ర పనిమీదే ఉన్నారు. టాలీవుడ్ లోని టాప్ కథా రచయితలతో కలిసి ఈ చిత్రానికి సంభందించిన కథా చర్చలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ‘ఆదిత్య 369′ కి సీక్వెల్ గా రూపొందనున్న ‘ఆదిత్య 999′ చిత్రానికి సంభందించిన కథా చర్చలు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ రెండు చిత్రాల్లో మొదట ఏది సెట్స్ పైకి వెళ్లనుంది అనేది ఇంకా తెలియలేదు.
         'శ్రీ కృష్ణదేవరాయలు' పేరు వినగానే 'మహామంత్రి తిమ్మరుసు' లో ఆ పాత్రకి నిండుదనాన్ని తెచ్చిన ఎన్టీఆర్, ఆ తరువాత 'ఆదిత్య 369 'చిత్రంలో ఆ పాత్రలో అదరహో అనిపించిన బాలకృష్ణ గుర్తొస్తారు. ఈ సినిమాలో కృష్ణదేవరాయలుగా బాలకృష్ణ తెరపై కనిపించింది కొంతసేపే. ఇక ఇప్పుడు ఇదే పాత్రని బాలకృష్ణ పూర్తిస్థాయిలో balayya_innపోషించబోతున్నారు. ఇటీవలి కాలంలో భక్తి రసాత్మక చిత్రాలను సైతం ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చిత్రీకరించడంలో తన ప్రత్యేకతను చాటుకున్న రాఘవేంద్రరావు, తాజాగా చారిత్రకాలకి శ్రీకారం చుడుతుండటం ముదావహం.
       ఇదిలా ఉండగా, బాలకృష్ణ కథానాయకుడిగా ఆర్‌ఆర్‌ మూవీమేకర్స్‌ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత రమేష్‌ పుప్పాల 'సామాన్యుడు' ఫేం రవికుమార్‌చావలి దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం 'శ్రీమన్నారాయణ' ఆగస్టు చివరి వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి మాటలు: పోలూర్‌ ఘటికాచలం, సినిమాటోగ్రఫి: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్‌ గౌతంరాజు, ఆర్ట్‌: నాగేందర్‌, కోడైరెక్టర్‌: ఎస్‌.సురేష్‌కుమార్‌, పబ్లిసిటీ డిజైనర్‌: రమేష్‌వర్మ, కాస్ట్యూమ్స్‌: ప్రసాద్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: వి.చంద్రమోహన్‌, మేనేజర్స్‌: కమల్‌మోహన్‌రావు, రామ్మోహన్‌, నిర్మాత: రమేష్‌ పుప్పాల, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్‌ చావలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bumper collections for julayi
Pawan trivikram movie produced by bvsn prasad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles