Balakrishna srimannarayana story

balakrishna srimannarayana story

balakrishna srimannarayana story

1.gif

Posted: 07/05/2012 03:29 PM IST
Balakrishna srimannarayana story

      నందమూరి నటసింహం పందికొక్కుల పాలిట సింహస్వప్నం కాబోతున్నాడు. ఇక్కడ పందికొక్కులంటే.. ప్రజల సొమ్ము కోటానుకోట్లు అక్రమంగా బొక్కేసేవారని అర్థం. పవర్ ఫుల్ జర్నలిస్ట్ అవతారంలో వీరి తాటతీసేందుకు బాలకృష్ణ 'శ్రీమన్నారా యణ' అవతారం 2fffఎత్తుతున్నారని చిత్ర నిర్మాత రమేష్‌ పుప్పాల అంటున్నారు. రమేష్  గతంలో రవితేజతో మిరపకారు నిర్మించారు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో నాని హీరోగా 'పైసా' అనే చిత్రాన్నికూడా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది రెండు సినిమాలు నిర్మిస్తున్నందుకు ఆనం దంగా ఉందని ఆయన సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు. శ్రీమన్నారాయణ మూవీలో బాలకృష్ణ క్యారెక్టర్‌ రిపోర్టర్‌గా ఉంటుందనీ,. జర్నలిస్టుగా ఉండి సొసైటీలో ఉన్న అవినీతిని చూసి సహించలేని పాత్రని బాలయ్య చక్కగా పోషించారన్నారు. వృత్తిలో భాగంగా ప్రజల సొమ్మును పంది కొక్కుల్లా దోచుకుతింటున్న వారిపై తిరగబడతాడు. ఆప్రజలు ఎవరోకాదు. ఎండనక వాననక కష్టపడే రైతుల సొమ్మును, వారి శ్రమను దోచు కుంటున్న పెద్దలపై తిరగబడే కథే శ్రీమన్నారాయణ అని చెప్పారు. ఈ కథ విని మరోమాట మాట్లాడకుండా ఈ చిత్రాన్ని చేస్తున్నామని, వెంటనే ఓకే చెప్పిన బాలకృష్ణకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చిత్ర దర్శకుడు రవిచావలి చెప్పారు. నిన్న నిర్మాత రమేష్ పుప్పాల బర్త్డే చాలా కలర్ ఫుల్ గా సాగింది. దీనికి సంబంధించిన పిక్స్ ఆల్రెడీ మీకోసం అందించాం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Writer chinni krishna case details
Heavy tax in the form of vat for producers in state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles