Writer chinni krishna case details

writer chinni krishna case details

writer chinni krishna case details

9.gif

Posted: 07/05/2012 03:36 PM IST
Writer chinni krishna case details

     సహాయ రచయితను బెదిరించడంతోపాటు దాడికి పాల్పడిన ఆరోపణల మీద సినీ రచయిత చిన్నికృష్ణపై నిన్న ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన సంగతి మీకు వెల్లడించాం. అసలు ఈ గొడవ తాలూకూ నేపథ్యం ఇలా ఉంది. చిన్నికృష్ణ వద్ద సిరిపురం 4eకిరణ్‌కుమార్ సహాయ రచయితగా పనిచేస్తున్నారు. తన అవసరాలకోసం చిన్నికృష్ణ వద్ద రూ. 14 లక్షలు అప్పు తీసుకున్నారు. నెలనెలా వడ్డీ చెల్లిస్తున్న ఆయన 3 నెలలుగా బాకీపడ్డారు. డబ్బు చెల్లించాలని కృష్ణ కోరగా ఇబ్బందుల్లో ఉన్నానని, కొద్ది సమయమిస్తే అసలు, వడ్డీ మొత్తం ఇచ్చేస్తానని కిరణ్ చెప్పారు. నిరాకరించిన చిన్నికృష్ణ మధురానగర్‌లో ఉంటున్న కిరణ్ ఇంటికి ఆదివారం తెల్లవారుజామున తన అనుచరులతో వెళ్లి బెదిరించారు. డబ్బు మొత్తం చెల్లించాలని, లేకుంటే చంపి ముక్కలుముక్కలుగా కోసేస్తానని హెచ్చరించారు. అంతేగాక దాడి కూడా చేశాడనీ కిరణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పదిహేనేళ్లుగా చిన్నికృష్ణ వద్ద పని చేస్తున్నానని, అప్పుగా తీసుకున్న డబ్బుకు వడ్డీతోసహా ఇప్పటికే రూ.20 లక్షలు చెల్లించానన్నారు. ‘జీనియస్’ సినిమాకు తాను రచయితగా పనిచేస్తుండటాన్ని మనసులో పెట్టుకొని ఆయన తనపై కక్ష కట్టారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిన్నికృష్ణపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా చిన్నికృష్ణ పరారీలోనే ఉన్నారని ఎస్సై గోవింద్‌రెడ్డి తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Svsc shooting now in ahobilam forest
Balakrishna srimannarayana story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles