Amala paul and vijay relation

1.7.gif

Posted: 06/13/2012 07:21 PM IST
Amala paul and vijay relation

      అమలాపాల్ – విజయ్ సంబంధం బెడిసికొట్టిందా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.6e గత కొంత కాలంగా దర్శకుడు ఏ.ఎల్.విజయ్ తో అమలాపాల్ కు ఎఫైర్ ఉందంటూ కోలీవుడ్ లో బాగా ప్రచారం జరిగింది. అది నిజమేనన్నట్టుగా ఇద్దరూ కలిసి మెలసి తిరిగారు కూడా. దైవ తిరుమగల్ (తెలుగులో నాన్న) సినిమా షూటింగులో వీరి మధ్య ఏర్పడిన బంధం ఆ తర్వాత బాగా గట్టిపడిందని వార్తలొచ్చాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారంటూ గుసగుసలు వినిపించాయి.  అయితే, ఇప్పుడు వీరిద్దరూ హఠాత్తుగా విడిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారట. ప్రస్తుతం ఇద్దరూ వేర్వేరు సినిమాల షూటింగు కోసం లండన్లోనే ఉన్నప్పటికీ.. అస్సలు కలుసుకోనేలేదని తెలుస్తోంది. దీనికి తోడు విజయ్ కి ఇంట్లో వేరే సంబంధాలు కూడా చూస్తున్నారట. అయితే, షరా మామూలుగా ఇద్దరూ ఈ వార్తల్ని ఖండిస్తున్నారు. తమ మధ్య వున్నది కేవలం స్నేహం మాత్రమేననీ, 'బంధం' మాత్రం లేదనీ సెలవిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhas new movie rebal coming soon
Madhuri deekshit new era  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles