Prakash raj directs amir khan

prakash raj directs amir khan

prakash raj directs amir khan

15.gif

Posted: 06/11/2012 06:34 PM IST
Prakash raj directs amir khan

      pra_eజాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ నటించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడిదే విషయం ఇటు టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ చర్చనీయాంశమైంది. 'ఆకాశమంత' హిందీ రీమేక్‌లో అమీర్‌ఖాన్‌ నటించనున్న సంగతి తెలిసిందే. 2009లో వచ్చిన తండ్రీ కూతుళ్ల ప్రేమానురాగాలకి అద్దం పట్టింది. కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడేవారి మనసు దోచుకుంది. ఈ సినిమాలో తండ్రిగా ప్రకాష్‌రాజ్‌..కూతురుగా త్రిష సహజమైన నటనను కనబరిచారు.
    అయితే, ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన తీరు, బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమీర్‌ఖాన్‌ మనసుని కట్టి పడేయడంతో, ఆయన ఈ సినిమా రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా దర్శకుడిగా ప్రకాష్‌రాజ్‌ పేరు వినిపిస్తోంది. గతంలో తెలుగు-కన్నడ సినిమాలకి దర్శకుడిగా వ్యవహరించిన ప్రకాష్‌రాజ్‌, ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Svsc release date conformed
Allu arvind party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles