ప్రముఖ టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ కాంబినేషన్‌లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో సీతమ్మ...యూనిట్ సభ్యులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ముందుగానే ఈ చిత్రం తాలూకు విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
దూకుడు చిత్రం సెప్టెంబర్ 23న విడుదల అయ్యి సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసింది. అదే సెంటిమెంట్ తో ఈ సినిమాను ఆ రోజు విడుదల చేసేందుకు ప్తాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియో రైట్స్‌కు కూడా మంచి డిమాండ్ వచ్చింది. ఆదిత్యా మ్యూజిక్ ఆడియో వారు ఈ చిత్రం రైట్స్‌ని హెవీ కాంపిటేషన్‌లో ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. మిక్కీజే మేయర్ ఈ చిత్రానికి మంచి మెలోడీ మ్యూజిక్ అందించాడని, ఆడియో పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ...''అన్న కోసం తమ్ముడు అడవులకు వెళితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడయితే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి'' అన్నారు.
లీడింగ్ హీరోలు నటిస్తోన్న కుటుంబ కథాచిత్రం కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more