Kareena to replace aishwarya

gossip,bollywood,tollywood,kollywood,news,celebrity,Kareena Kapoor replaces Aishwarya in HEROINE Movie Video

gossip,bollywood,tollywood,kollywood,news,celebrity,Kareena Kapoor replaces Aishwarya in HEROINE Movie Video

Kareena to replace Aishwarya.gif

Posted: 05/30/2012 03:13 PM IST
Kareena to replace aishwarya

Aish_kareena

బాలీవుడ్ ని ఓ ఊపు ఊపిన మేటి హీరోయిన్ ఐశ్వర్యరాయ్. ఈమె అందంతో, నటనతో అందరి మనస్సులు దోచడమే కాకుండా ఏ సినిమాలోనైనా ఐశ్వర్యరాయ్ పెట్టుకుంటే బాగుంటుందనే స్థాయికి వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ని పెళ్ళి చేసుకున్న తరువాత కూడా తన హవాని కొనసాగించింది. తరువాత ఆమె గర్భవతి కావడంతో సినిమాలకి పుల్ స్టాప్ పెట్టింది. ఇప్పుడు ఆమె అవకాశాల్ని ఓ స్టార్ హీరోయిన్ కొట్టేస్తుంది. ఐశ్వర్య ఉన్నప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ ఉండే కరీనా కపూర్ ఐశ్వర్య తప్పుకోవడంతో ఆమె అవకాశాల్ని ఈమె క్యాష్ చేసుకుంటుంది.

ఆమధ్య మాధుర్ బండార్కర్ ముందుగా తన 'హీరోయిన్' చిత్రాన్ని ఐశ్వర్యతోనే మొదలెట్టాడు. అయితే, హఠాత్తుగా ఆమె గర్భవతి కావడంతో ఆమెను వదిలించుకుని, కరీనాను ఎంచుకున్నాడు. తాజాగా ఐశ్వర్య చేయాల్సిన సంజయ్ లీలా భన్సాలీ చిత్రం 'రామ్ లీలా' కూడా కరీనాకు వెళ్ళిపోయింది. ఐశ్వర్యను ఎంతో అభిమానించే సంజయ్ ఆమెను కాదని, కరీనాను ఎంచుకోవడం వెనుక వున్నా కారణం ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే బాలీవుడ్ జనాలు కరీనా సంజయ్ తో భారీ లాబీయింగ్ చేసిందని అందుకే ఆమెకు ఈ అవకాశాన్ని ఇచ్చాడని అనుకుంటుంన్నారు. ‘రాజు లేనప్పుడు – రాజ్యానికి అధిపతి మంత్రే’ అన్నట్లు ఐశ్వర్య లేకపోయే సరికి కరీనా తన హవాని బాలీవుడ్ లో కొనసాగిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Superstar krishna birthday today
Allu sirish debut movie gouravam heroin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles