Superstar krishna birthday today

superstar krishna birthday today

superstar krishna birthday today

1.gif

Posted: 05/31/2012 12:53 PM IST
Superstar krishna birthday today

      kri_1_inసినిమాల్లో సాహసం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. తనదైన డైలాగ్ డెలివరీ ఉర్రూతలూగించే నటనా చాతుర్యం ఆయన సొంతం. ఎలాంటి పాత్రనైనా అన్ని తరాల వారు మెచ్చేలా అద్బుతంగా పోషించిన నటశేఖరుడు. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. ఇవాళ (గురువారం) కృష్ణ పుట్టినరోజు. తెలుగు సినీ జగత్తులో తన కంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కృష్ణ తన సినీ సుధీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. అంతకుముందు తెలుగు సినీ రంగంలో ఎవరూ చేయనటువంటి విభిన్న పాత్రలు చేసి మెప్పించగలిగిన ధీశాలి ఆయన.
      సూపర్ స్టార్ కృష్ణ పుట్టుపూర్వత్రాలను  ఓ సారి పరికిస్తే. గుంటూరు జిల్లా, బుర్రిపాలెం లో 1943 మే 31న ఘట్టమనేని శివ రామ కృష్ణగా జన్మించారు.kri_2_in దాదాపుగా తెలుగు పరిశ్రమలో నాలుగు దశాబ్దాల పాటు నటించారు, ఇప్పటికీ అడపాతడపా నటిస్తూనే ఉన్నారు.  1965లో చిన్న పాత్రలతో మొదలు పెట్టిన తన సిని ప్రస్థానం.. చిత్ర పరిశ్రమలో ప్రముఖ తారల్లో ఒకరిగా చేరింది. కృష్ణ గారు తెలుగు తెరకి ఎన్నో సాంకేతిక విషయాలని పరిచయం చేశారు. డిటిఎస్, కలర్ ఫిలిం, 70ఎంఎం మరియు సినిమా స్కోప్ వంటివి తెలుగు తెరకు పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణే.
       ఇంతే కాకుండా కౌబాయ్, జేమ్స్ బాండ్ (సిక్రెట్ ఏజెంట్స్) వంటి చిత్రాలను కూడా కృష్ణ  తెలుగు తెరకు పరిచయం చేశారు. “మోసగాళ్ళకి మోసగాడు” మరియు “గూడాచారి 116″ వంటి చిత్రాలతో తెలుగు చిత్ర గమనాన్ని మార్చారు. కృష్ణ ఖాతాలో 350కి పైగా చిత్రాలు ఉన్నాయి.  అందులో భారీ విజయాలు సాధించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ” దేవుడు చేసిన మనుషులు”,”అల్లూరి సీతారామ రాజు”,”మోసగాళ్ళకి మోసగాడు”, ” పండంటి కాపురం”, “అవే కళ్ళు”  ‘‘సింహాసనం’’ వంటి వంటి ఎన్నో చిత్రాలు చరిత్రలో నిలిచిపోయాయి.
    kri_3_in  అటు సినీ రంగంతో పాటు.. ప్రజలకు తనకంటూ ఏదో చేయాలన్న తలంపుతో రాజకీయరంగంలోకి సైతం ప్రవేశించిన సూపర్ స్టార్ ప్రజాప్రతినిధిగా పలు పదవులను అధీష్టించి ప్రజానీకానికి తన పరిధిమేర మేలు చేకూర్చారు. మేటినటుడు, సామాజిక స్ప్రుహ ఉన్న సూపర్ స్టార్ కృష్ణ మరిన్ని పుట్టినరోజులు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆశిస్తోంది ఆంధ్రావిశేష్.కాం.. హ్యాపీ బర్తడే కృష్ణ జీ...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan range in high
Kareena to replace aishwarya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles