Tollywood top heroines in a dialamma situation

tollywood top heroines in a dialamma situation

tollywood top heroines in a dialamma situation

1.gif

Posted: 05/29/2012 04:56 PM IST
Tollywood top heroines in a dialamma situation

      ఇప్పుడు తెలుగు చిత్ర సీమను ఏలుతోన్న అగ్ర కథానాయికల మదిని తొలిచేస్తోన్న ప్రశ్న ఏదంటే... ఆమెదగ్గర ఉన్నదేంటి..మాదగ్గర లేనిదేంటి.., అంతేకదు..sa_innee ఈ షాకుమీద షాకులేంటి.. ఇదే మీమాంశ... సాధారణంగా కొంతమంది పైకి స్టేట్మెంట్లు అవీ ఇవ్వకుండా చాలా సైలెంట్ గా కనిపిస్తూ, మిగతా వాళ్లకి షాక్ ఇచ్చేస్తూవుంటారు. సమంతా కూడా ఇప్పుడు అలాగే కనపడుతోంది. కాజల్, తమన్నా వంటి తన స్థాయి హీరోయిన్లకు ఈ చెన్నయ్ అందం అలాంటి షాకులే ఇస్తోంది. ఓ పట్టాన వాళ్లకి ఈ ముద్దుగుమ్మ మింగుడుపడడం లేదు. గౌతమ్ మీనన్ లాంటి దర్శకుడితో వరుసగా రెండు సినిమాలు (ఏ మాయ చేసావే, ఎటో వెళ్ళిపోయింది మనసు) చేయడమే ఒక క్రెడిట్ అనుకుంటే... ఆ వెంటనే కథానాయికల కలల దర్శకుడు మణిరత్నం సినిమాలో నటించే అవకాశం కొట్టేసి, మిగతా హీరోయిన్లకు షాక్ ఇచ్చింది. ఇదంతా ఒక ఎత్తనుకుంటే, తాజాగా శంకర్ సినిమాలో కూడా చాన్స్ అందిపుచ్చుకుని పెద్ద షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో... అసలు తమలో లేనిదీ, సమంతాలో ఉన్నదీ ఏమిటంటూ.. ఈ హీరోయిన్లు ఎవరికీ చెప్పకుండా తమలో తామే మధనపడుతున్నారట.
       ఇంతవరకూ సమంతా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించిందన్న సినిమా కూడా ఏమీ లేదనీ, మరి ఈ అవకాశాలు ఆమెకెలా వస్తున్నాయనీ అనే ఆలోచనలో ఈ తారలు ఉన్నారని సమాచారం. అయితే ఒకటి, మణిరత్నం, శంకర్ వంటి దర్శకుల వద్ద రికమండేషన్లు, కాకా పట్టడాలు వంటివి పనిచేయవన్నది అందరికీ తెలిసిందే. మరి, సమంతా ఎలా ఈ అవకాశాలు పొందుతోంది? ఇది హీరోయిన్లనే కాదు... ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లలో అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఆనక దీనికి సంమంతానే సమాధానం చెబుతుందేమో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anand sai sets for ram charan marriage
Mahesh babu and boyapati srinu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles