Nayan clarification

nayan clarification

nayan clarification

32.gif

Posted: 05/17/2012 07:11 PM IST
Nayan clarification

       అందాల తార నయనతార డర్టీగా నటించనంటూ చాపచుట్టేసింది.  'నేనా... డర్టీ పిక్చర్ లో నటించడమా?' అంటూ నయనతార ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది.nayan_ee రెండున్నర కోట్లు పారితోషికం తీసుకుంటూ, డర్టీ పిక్చర్ రీమేక్ లో నయన్ నటిస్తోందంటూ వార్తలు గుప్పుమన్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు, ఆ పాత్ర కోసం బరువు పెంచుకునే పనిలో కూడా ఆమె ఉందంటూ కథనాలు వచ్చాయి. దాంతో, ఉలిక్కిపడిన నయన్ ఒక్కసారిగా వివరణలు ఇస్తోంది.
       "డర్టీ పిక్చర్ సినిమా నాకు నచ్చింది. అందులో విద్యాబాలన్ బాగా నటించింది.  అయితే, ఆ కథా వస్తువు మన వాతావరణానికి సరిపడదు. అలాగే, సిల్క్ స్మిత పాత్ర నాకస్సలు నప్పదు" అంటోంది నయన్. ఆ పాత్ర చేయడానికి నయన్ ఉత్సాహం చూపిన మాట నిజమేననీ, మరి ఇంతలోనే మనసు ఎందుకు మార్చుకుందబ్బా? అంటూ కోలీవుడ్ జనం ఆశ్చర్యపోతున్నారు. ఏమైనా, నయన్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది కాబట్టి ఇదే నిజమనుకోవాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress sneha and prasanna marriage gift
Pop singer jennifer lopez  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles