Actress sneha and prasanna marriage gift

actress sneha and prasanna marriage gift

actress sneha and prasanna marriage gift

33.gif

Posted: 05/17/2012 07:16 PM IST
Actress sneha and prasanna marriage gift

      7 పెళ్లి కానుకకు కొత్త జంట ఫిదా అయిపోయింది.  అందాలతార స్నేహ, ప్రసన్నల పెళ్లికి ఎన్నో కానుకలువచ్చాయి. అయితే, వాళ్లందుకున్న ఒక అపురూపమైన కానుక మాత్రం ఆ దంపతుల్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతోంది. పైగా, అది సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి అందుకోవడం మరో విశేషం. ఇటీవల వివాహం జరుపుకున్న ఈ దంపతులకి శుభాకాంక్షలు తెలుపడానికి రజనీ స్వయంగా వీళ్ళింటికి వచ్చాడు. తను ఎంతగానో ఆరాధించే రాఘవేంద్రస్వామి ఫోటోతో కూడిన ప్రేమ్ ను ఈ సందర్భంగా రజనీకాంత్ ఈ నూతన దంపతులకు కానుకగా అందించాడు. అది చూసి ఉబ్బితబ్బిబ్బయిన స్నేహ జంట, రజనీ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు స్వీకరించారు. 'రజనీ సార్ తో గడిపిన ఆ క్షణాలు మాకు మధుర జ్ఞాపకాలు. ఆయన అందించిన కానుక మమ్మల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది' అంటోంది ఈ ప్రేమజంట.8
       ఇటీవలే దంపతులుగా మారి, తమ ప్రేమను పండించుకున్న స్నేహ, ప్రసన్న జంట ప్రస్తుతం ఆ పెళ్లి హడావిడి నుంచి కాస్త సేదతీరుతోంది. త్వరలోనే హనీమూన్ కోసం అమెరికా వెళ్ళడానికి వీరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, వీరు తమ హనీమూన్ కి అమెరికాను ఎంచుకోవడానికి ఓ కారణం కూడా వుందట. అదేమిటంటే, గతంలో వీరిద్దరూ కల్సి 'అచ్చముండు అచ్చముండు' అనే చిత్రంలో భార్యాభర్తలుగా నటించారు. ఆ సినిమా షూటింగు అమెరికాలోనే జరిగింది. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొగ్గతొడిగింది. అందుకని ఆ సమయంలో తామిద్దరం కలిసి ఎక్కడెక్కడ తిరిగామో... ఎక్కడ తొలిసారిగా ప్రేమను పంచుకున్నామో... ఆ ప్రాంతాల తీపి జ్ఞాపకాలను స్వయంగా ఆస్వాదించాలని నిర్ణయించుకున్నారట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmanandam in daruvu
Nayan clarification  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles