Hero pawan kalyan suffering from severe back pain

hero pawan kalyan suffering from severe back pain

hero pawan kalyan suffering from severe back pain

15.gif

Posted: 04/27/2012 08:39 PM IST
Hero pawan kalyan suffering from severe back pain

       pawa_inn1 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నడుంనొప్పి తీవ్రమైంది. తాను నటిస్తోన్న కొత్త సినిమా ‘గబ్బర్ సింగ్’ లోని  స్పెషల్ సాంగ్ కెవ్వు కేక షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కి బ్యాక్ పెయిన్ వచ్చిందీ, అయినా పవన్ షూటింగ్లో పాల్గొంటున్నారని మనకు తెలుసు. అయితే ఇది మోతాదు మించటంతో ఆ పాటను పూర్తి చేయక కొంచెం రెస్ట్ తీసుకుంటాన్నారని సమాచారం.  గతంలోనే గబ్బర్ సింగ్ యాక్షన్ సన్నివేశంలో గుర్రం మీద నుంచి వచ్చే యాక్షన్ సీన్స్ తీస్తూంటే పవన్ కింద పడటంతో ఈ నొప్పిమొదలైంది. తాజాగా అదే నొప్పి మళ్లీ తిరగబెట్టిందని చెబుతున్నారు. 
       కాగా, అన్నపూర్ణ స్టూడియోలోని విశాల స్థలంలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్, బాలీవుడ్ సెక్స్ బాంబ్ మలైకా అరోరా, దాదాపు 100 మంది డాన్సర్స్‌తో భారీ ఎత్తున ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాస్ ట్యూన్స్‌తో కేకపెట్టించేలా రూపొందించారు.
     మే 9 విడుదల తేదీ ఇచ్చి ఉండటంతో ఎట్టి పరిస్ధితుల్లోనూ లేట్ కానివ్వకుండా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో మిగిలిన భాగాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka and hansika are the heroins in the forth coming surya film
There is six villans in balayya srimannarayana movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles