There is six villans in balayya srimannarayana movie

there is six villans in balayya srimannarayana movie

there is six villans in balayya srimannarayana movie

11.gif

Posted: 04/27/2012 05:53 PM IST
There is six villans in balayya srimannarayana movie

      బాలకృష్ణ కథానాయకుడుగా రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీమన్నారాయణ' చిత్రం షూటింగు శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో బాలయ్య బాబు ఒకరిద్దరు కాదు ఏకంగా ఆరుగురు విలన్లతో పోరాడబోతున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. హైదరాబాదు గచ్చిబౌలి లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తీసిన బాలకృష్ణ, ఫైటర్లపై యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆమధ్య 'మిరపకాయ్' చిత్రాన్ని నిర్మించిన రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో బాలకృష్ణ జర్నలిస్టుగా నటిస్తున్నట్టు  తెలుస్తోంది. Srimannarayana_inn
      కాగా, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ హీరో బాలకృష్ణకు ఫైట్లు కంపోజ్ చేస్తున్నాడు.  మనోజ్ తాను హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'ఊ కొడతారా... ఉలిక్కిపడతారా' చిత్రం కోసం బాలకృష్ణపై కొన్ని యాక్షన్ దృశ్యాలు ఉన్నాయి. బాలయ్య ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించబోతోన్న సంగతి తెలిసందే.  ఇప్పుడు ఆ యాక్షన్ దృశ్యాలనే హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు. హీరో మనోజ్ స్వతహాగా ఫైట్స్ కూడా కంపోజ్ చేస్తాడు కాబట్టి, ఇందులో బాలకృష్ణ పాత్రకు కూడా తనే కంపోజ్ చేస్తున్నాడు. శేఖర్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మనోజ్ పక్కన దీక్షా సేథ్ కథానాయికగా నటిస్తోంది.  ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ ఇటీవల కేరళలోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. మంచు మనోజ్, దీక్షా సేథ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero pawan kalyan suffering from severe back pain
Madhuri deekshit second innings start  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles