Young hero siddarth will act as a action hero in tamil

young hero siddarth will act as a action hero in tamil

young hero siddarth will act as a action hero in tamil

21.gif

Posted: 04/26/2012 07:38 PM IST
Young hero siddarth will act as a action hero in tamil

               si_inn11 అనుకున్న విషయాన్ని కుండబద్దలు గొట్టే యంగ్ హీరో సిద్దార్థ్ రూటు మార్చాడు.  ఇన్నాళ్లూ లవర్ బాయ్ గా కనిపించిన ఈ యంగ్ హీరో, త్వరలో యాక్షన్ హీరోగా కనిపించనున్నాడు. ఓ తమిళ చిత్రంలో తొలిసారిగా యాక్షన్ పాత్రను పోషించడానికి సిద్ధూ అంగీకరించాడు. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ దీనికి స్క్రిప్టును అందిస్తూ, ఈ చిత్రాన్ని ఆయనే నిర్మిస్తున్నారు. ఇటీవలి వరకూ ఆయన వద్ద అసోసియేట్ గా పనిచేసిన మణికందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి.
           ఈమూవీ యాక్షన్ ఓరిఎంటేడ్ కథాంశంతో రూపొందే చిత్రం కాబట్టి, అందుకు తగ్గట్టుగా వ్యాయామం చేస్తూ సిద్ధూ తన శరీరాన్ని మలచుకుంటున్నాడు. చెన్నయ్- బెంగళూరు హైవే మీద ఈ కథ సాగుతుంది. అందుకని షూటింగు కూడా హైవే మీదే ఎక్కువగా జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. 'దేశియా నెడుంచాలై' పేరుతో రూపొందే ఈ సినిమా షూటింగు వచ్చే నెల 2 నుంచి జరుగుతుంది. ఈ చిత్రంతో సిద్దూని కండల వీరుడిలా చూడొచ్చన్నమాట.
             కాగా, కొంతకాలంగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో  ప్రస్తుతం నందినీరెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం పైనే సిద్ధూ ఆశలు పెట్టుకున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allari naresh dance for chiru song
Hero manchu vishnu now onwards stunt director also  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles