Allari naresh dance for chiru song

allari naresh dance for chiru song

allari naresh dance for chiru song

26.gif

Posted: 04/26/2012 08:29 PM IST
Allari naresh dance for chiru song

             చిరంజీవి పాటకు  అల్లరి హీరో అల్లరి నరేష్ డ్యాన్స్ చేయబోతున్నాడు. ఇదేమిటీ అని ఆశ్చ్యర్య పోనక్కర్లేదు. ఈమధ్య పాత పాటల రీమిక్స్ మీద నరేష్ కూడా మోజు చూపిస్తున్నాడు. అందులో భాగంగా గతంలో చిరంజీవి నటించిన 'అల్లుడా మజాకా' చిత్రంలోని 'అత్తో... అత్తమ్మ... కూతురో' పాటను తాజాగా ఓ చిత్రంలో రీమిక్స్ చేస్తున్నాడు. aa
           సత్తిబాబు దర్శకత్వంలో చంటి అడ్డాల నిర్మిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రంలో ఈ పాటను చేస్తున్నారు.  ఇందులో రమ్యకృష్ణ కూడా నటిస్తుండడం విశేషం. కాగా, ఈ చిత్రం షూటింగు హైదరాబాదు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
 కాగా, ఈ మూవీ యమలోకం నేపథ్యంలో రూపొందుతుంది.  యముడిగా శాయాజీ షిండే, అతని భార్యగా రమ్యకృష్ణ నటిస్తున్నారని దర్శకుడు సత్తిబాబు చెప్పారు. నరేష్ కి నవ్వించడమే కాకుండా, ఏడిపించడం కూడా వచ్చన్న విషయాన్ని ఈ చిత్రం ప్రూవ్ చేస్తుందని ఆయన అన్నారు. ఈ సినిమాకి 12 సెట్లు వేస్తున్నామని నిర్మాత చంటి చెప్పారు. ఇద్దరు యముళ్ళను తానెలా ఏడిపిస్తానన్నది వినోదాత్మకంగా సాగుతుందని నరేష్ చెప్పాడు. తనకిష్టమైన నటి రమ్యకృష్ణతో నటించడం ఆనందంగా ఉందన్నాడు.
            కోటి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగు మే 15 నుంచి జరుగుతుంది. హీరో హీరోయిన్లు నరేష్, రిచాపనయ్ లపై చిత్రీకరించిన తొలి షాట్ కు నిర్మాత డి.రామానాయుడు క్లాప్ ఇవ్వగా, దర్శకుడు దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించిన చిత్రాలు మీకు నిన్ననే అందించాం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr dammu movie release all over the world today in nearly 1250 theaters
Young hero siddarth will act as a action hero in tamil  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles