Happy birthday to director boyapati srinu

happy birthday to director boyapati srinu

happy birthday to director boyapati srinu

15.gif

Posted: 04/25/2012 12:50 PM IST
Happy birthday to director boyapati srinu

14

              b0111అపజయమనే పదాన్ని ఊచకోత కోసి తన వైపు చూడాలంటేనే భయపడే రీతిలో ముందుకెళ్తున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన రూపొందించిన సినిమాలు చూసిన ప్రేక్షకులు అమ్మో.. ఏమి సినిమా అనుకుని అనుకుని థియోటర్ల నుంచి బయటకు వస్తారు. ఇక.. ఆయన సినిమాలో నటించే హీరోల వంతైతే మరీ విచిత్రం.. బోయపాటి చెబుతోన్న కథ వింటుంటేనే ఇదేంట్రాబాబు ఇలా కంగారుపెట్టేస్తున్నాడని హడలి పోవటం హీరోల వంతు.. చివరికి ఫలితం అమోఘం.. అయ్యో ఈ చిత్రం తను చేసుంటే బావుండేదే అనేది అవకాశాలు వదులుకున్న హీరోల నిట్టూర్పు.. అది క్లుప్తంగా దర్శకుడు బోయపాటి.
               bo2222ఈ సంచలన దర్శకుడు నేడు నూతన వసంతంలోకి అడుగు పెట్టాడు. హీరోల తోపాటు తనదైన శైలిలో ఫ్యాన్స్ ను సంపాదించుకుంటోన్న బోయపాటి పుట్టిన రోజును అతని అభిమానులు సైతం హ్యాపీ గా జరుపుకుంటున్నారు. మాస్ పల్స్ తెలిసిన బోయపాటి 2005లో “భద్ర” చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తరువాత 2007లో విక్టరీ వెంకటేష్ తో “తులసి” చిత్రంతో తన సత్తా చాటారు. 2010లో విడుదలయిన సింహ చిత్రంతో ఈ దర్శకుడు పరిశ్రమలో అగ్ర దర్శకుల్లో చేరిపోయారు. రూపొందించిన మూడు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్బుతమయిన కలెక్షన్లను రాబట్టాయి. దీంతో మూడు సినిమాలకే అగ్రదర్శకుల సరసన చేరిపోయారాయన. తను సృష్టించిన పాత్రలో తానే నిలబడి నటుడికి వివరించటం రాజమౌళి వలే, బోయపాటికి అలవాటు. అందుకే సన్నివేశం తప్పకుండా పండి తీరుతుంది. అదే అతని విజయానికి  ఓ కిటుకు. bo333
                యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ సినిమా రిలీజ్ కు ముందే సంచలనం చేస్తోన్న దశలో బోయపాటికి ఈ పుట్టిన రోజు ప్రత్యేకమనే చెప్పుకోవాలి. అతని సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించటం అతనికి మరింత ఆనందదాయకమైంది. అందుకే ఫుల్ జోష్ లో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ తన బర్త్డే ని పురస్కరించుకుని నిన్ననే ల్యాండ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు.  టాలీవుడ్ లో ఈ కారు అతి కొద్ది మందికి మాత్రమే ఉంది. ఇప్పటి వరకు పరిశ్రమలో రామ్ చరణ్, రాజమౌళి, నాగచైతన్య, మహేష్ బాబు, ఎన్టీయార్, మోహన్ బాబు వంటి కొందరికే ఈ కారుంది. dammu_new111111111111
               ‘దమ్ము‘ చిత్రం అనంతరం బోయపాటి - మహేష్ బాబు  కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతోంది. దీనికి కథ కూడా రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించబోతున్నారు.  కాగా,  నందమూరి తారక రామారావు-బోయపాటి శ్రీను ఇద్దరూ తమ దమ్మెంతో చూపేందుకు ఈ శుక్రవారం (ఏప్రిల్ 27) కోసం ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు. ఆరోజు ‘దమ్ము’ సినిమా వెండి తెరలను తాకబోతోంది. ఈ సినిమా విజయవంతమై బోయపాటి అపజయాలను తన సినిమాల్లోలానే ఊచకోత కోస్తూ ముందుకు సాగాలని మనసారా ఆకాంక్షిస్తోంది ఆంధ్రావిశేష్.కాం...హ్యాపీ బర్త్డే బోయపాటి..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sriya saran new movie mohan babus ravan
Megastar chiranjeevi re entry into cinima  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles