Maniratnam new film kadal do big business

maniratnam new film kadal do big business

maniratnam new film kadal do big business

22.gif

Posted: 04/03/2012 09:37 PM IST
Maniratnam new film kadal do big business

             KADAlమణిరత్నం పేరు చెబితేనే ఆ సినిమా ఆణిముత్యమని వేరే చెప్పనక్కరలేదు.  ఇప్పుడు మణిరత్నం రూపొందిస్తున్న 'కడల్' చిత్రం కూడా అలాగే బిజినెస్ లో సంచలనం సృష్టించింది. జెమిని ఫిలిమ్స్ సంస్థ 25 కోట్లు ఆఫర్ చేసి, ఈ చిత్రం ధియేటర్ హక్కుల్ని సొంతం చేసుకుందని తెలుస్తోంది.
           మణిరత్నం, ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్లో వస్తున్న ప్రేమ కథా చిత్రం కావడంతో బాటు, మంచి క్యాస్టింగ్ కూడా ఇందులో ఉండడంతో, జెమినీ సంస్థ ఆ రేటుని ఆఫర్ చేసిందట. సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కార్తీక్ హీరోగా నటిస్తున్నాడు.
ఇతర పాత్రల్లో అర్జున్, అరవింద్ స్వామి, మంచు లక్ష్మి తదితరులు నటిస్తున్నారు. తమిళనాడు తీరప్రాంతానికి చెందిన జాలరుల జీవనం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా మణి దీనిని రూపొందిస్తున్నాడు. ఎప్పటిలాగే మణిరత్నం సినిమా అయిన దీనికి కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero nihil is obscand in a cheating case says police
Nag new restaurent  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles