Hero nihil is obscand in a cheating case says police

hero nihil is obscand in a cheating case says police

hero nihil is obscand in a cheating case says police

2.gif

Posted: 04/04/2012 12:57 PM IST
Hero nihil is obscand in a cheating case says police

             nikhil_arrestహీరో నిఖిల్ పరారీలో ఉండటమేమిటని ఆశ్చ్యర్యపోతున్నారా అవుననే అంటున్నారు. నగరపోలీసులు.  నిఖిల్ ప్రస్తుతం పరారీలో వున్నట్టు పోలీసులు చెబుతున్నారు. యువ కథానాయకుడు, 'అంగ్రేజ్' హీరో, చిత్ర నిర్మాత నిఖిల్ రెడ్డి పై హైదరాబాదులో చీటింగ్ కేసు నమోదైంది. 
           'అంగ్రేజీ' సినిమాతో ఆర్టిస్టుగా మారిన నిఖిల్, ఆమధ్య ఓ వ్యాపారవేత్త నుంచి 50 లక్షలు అప్పుగా తీసుకుని, పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చాడని, అయితే  చెల్లని చెక్కు ఇచ్చి రూ.50 లక్షల మోసానికి పాల్పడ్డాడని అతనిపై నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో వసంత్ కుమార్ గౌడ్ అనే పైనాన్షియర్ ఫిర్యాదు చేశాడు. ఆ చెక్కులు బౌన్స్ అవ్వడంతో వ్యాపారవేత్త తన డబ్బు అడగడంతో, నిఖిల్ అతనిని తుపాకీతో బెదిరించాడని సదరు వ్యాపార వేత్త పోలీసులకు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.financiar 
            దీంతో, బాదితుడి ఫిర్యాదు మేరకు నారాయణగూడా పోలీసులు నిఖిల్ పై చీటింగ్ కేసు నమోదు చేసి, అతని కోసం గాలిస్తున్నారు. గతంలో నెల్లూరులో కూడా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని మోసం చేసిన ఘటనలో నిఖిల్ రెడ్డి జైలుకు కూడా వెళ్లాడు. ఫిబ్రవరిలో అతను జైలు నుంచి విడుదలయ్యాడు.  ఈ తాజా వివాదం పూర్వాపరాలు మరింత లోతుగా త్వరలోనే వెలుగుచూసే అవకాశం ఉంది.

            తాజా సమాచారం ఏమిటంటే... సినీ నిర్మాత, హీరో నిఖిల్ రెడ్డిని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంగ్రేజీ - 2 సినిమా హక్కులు ఇప్పిస్తానని వసంత్ కుమార్ గౌడ్ అనే ఫైనాన్షియర్ దగ్గర 42లక్షలు తీసుకుని చీటింగ్ చేసినందుకు గౌడ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఖిల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే నిఖిల్  మాత్రం ఎవర్నీ చీటింగ్ చేయలేదని బుకాయిస్తున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan tej rachha movie theators list in nizam
Maniratnam new film kadal do big business  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles