భారత్‌లో వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 10 శాతానికి పైగా పెంచుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ `బీఎండబ్ల్యూ` లక్ష్యంగా పెట్టుకున్నది. ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4ను భారత్‌లో ఆవిష్కరించింది. వాహనాల విద్యుద్ధీకరణ వేగవంతం చేస్తామని తెలిపింది. దీని ధర రూ.69.9 లక్షల నుంచి మొదలవుతుంది. వచ్చే ఆరు నెలల్లో మూడు ఎలక్ట్రిక్ కార్లను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరిస్తామని గతేడాది నవంబర్‌లోనే బీఎండబ్ల్యూ ప్రకటించింది. ఇప్పటికే ఆల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐఎక్స్, ఆల్ ఎలక్ట్రిక్ మినీ ఎస్ఈ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ కార్లను ఆవిష్కరించింది.
‘‘భారత్ మార్కెట్‌లో ఐఎక్స్, మినీ ఎస్ఈ (ఎలక్ట్రిక్) కార్లను ఆవిష్కరించగా.. సుమారు ఐదు శాతం గిరాకీ ఉంది. వచ్చే ఏడాది ఐ4 ఆవిష్కరణతో తమ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 10 శాతం దాటతాయని అంచనా వేస్తున్నట్లు’’ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈవో విక్రం పవాహ్ తెలిపారు. ఇక త్వరలో అవిష్కరించనున్న`ఐ4` కారు కేవలం 5.7 సెకన్లలో 100 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 80.7 కిలోవాట్ అవర్స్ ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 590 కి.మీ. దూరం ప్రయాణించడం దీని స్పెషాలిటీ.
పూర్తిగా దిగుమతి చేసుకునే `ఐ4` కంప్లీట్‌లీ బిల్ట్ యూనిట్.. బీఎండబ్ల్యూ గ్రూప్ ఈ-డ్రైవ్ టెక్నాలజీలో ఐదో తరం కారు. ఇది ఎలక్ట్రిక్ మోటార్, సింగిల్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్, పవర్ ఎలక్ట్రానిక్స్ తదితర ఫీచర్లు కలిగి ఉంది. ఆన్‌లైన్‌లో బీఎండబ్ల్యూ ఐ4 కారును shop.bmw.in వైబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. జూలై నుంచి కార్ల డెలివరీ ప్రారంభిస్తారు. బీఎండబ్ల్యూ ఐ4 కారుతోపాటు కాంప్లిమెంటరీగా బీఎండబ్ల్యూ వాల్‌బాక్స్ చార్జర్ ఇన్‌స్టల్ చేస్తారు. ఇంటి వద్ద 11కిలోవాట్ల వరకు సురక్షితంగా, సౌకర్యవంతంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | నోకియా ఫోన్ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా నోకియా జీ 21 ('Nokia G21') పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్... Read more
Apr 22 | పెట్రోలు ధరలు సామాన్యులనే కాదు సంపన్నులను ఇబ్బంది పెడుతున్నాయి. రెండేళ్లలో లీటరు పెట్రోలు ధర రమారమి రూ.50 వంతున పెరిగింది. దీంతో పెట్రోలు వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు జనాలు మళ్లుతున్నారు. ఈ... Read more
Mar 31 | ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో తాజాగా ఆధునీకరించిన కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్‌ను విడుదల చేసింది. పరికొత్త ఫీచర్స్ తో వచ్చిన కైగర్ లుక్ కూడా ఆకట్టుకుంటోంది. డబ్బుకు సైరన విలువతోపాటు అధునాతన ఫీచర్లు... Read more
Mar 07 | ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మోరిస్ గ్యారేజీస్(ఎంజీ) మోటార్స్ నేడు తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్యువీ) 'జెడ్ఎస్ ఈవీ' అప్డేట్ వెర్షన్ కారును భారతదేశంలో లాంఛ్ చేసింది. ఎంట్రీ లెవల్ ఎక్స్ ప్లోజ్... Read more
Mar 04 | దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కూడా పర్యావరణ హితమైన ఈవీ వాహనాల తయారీలో నిమగ్నమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థ తన భవిష్యత్తు ఎలక్ట్రిక్, కొత్త జనరేషన్... Read more