Bajaj Auto to refocus on Qute quadricycle బజాబ్ క్యూటో: హైదరాబాదీలకు అటో చార్జీలో కారు ప్రయణం

Bajaj auto to refocus on qute quadricycle revive partnership with uber

Bajaj Auto, Bajaj Auto news, Bajaj Qute, Qute bajaj, Mahindra Atom, quadricycle, Uber, Bengaluru, Hyderabad, commercial purposes (taxi), Auto, Business, Technology

After the successful pilot project in Bengaluru in collaboration with Uber, Bajaj Auto plans to revive the initiative in the city and expand to other metros such as Hyderabad. The company expects sales of Qute, India’s first quadricycle, to commence in Q4 FY22.

బజాబ్ క్యూటో: హైదరాబాదీలకు అటో చార్జీలో కారు ప్రయణం

Posted: 07/28/2021 07:56 PM IST
Bajaj auto to refocus on qute quadricycle revive partnership with uber

బజాజ్ ఆటో రూపోందించిన బజాబ్ క్యూట్ మరోమారు భారతీయ రోడ్లపై పరుగులు తీయనుంది. భారత్ స్టాండెండ్ నాలుగుకు ముందు మహారాష్ట్ర, కేరళ, గుజరాత్ మార్కెట్లలో కేవలం ప్రయాణికుల రవాణా (టాక్సీలు) తరహాలో సేవలు అందించిన క్యూటో.. ఇక తాజాగా ఉబర్ సంస్ధతో జతకలసి దేశీయంగా పలు నగరాల్లోని ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్దం అవుతోంది. ఇక మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో క్యూటో కూడా ఎలక్ట్రిక్ వాహనంగా కూడా మారనుందని సంస్థ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ ఏడాది చివరి నాటికి క్యూటో సేవలు హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి.

అంతేకాదు కారు ప్రయాణం అటో చార్జి కన్నా చౌకగా నగరవాసులు ప్రయాణాలు కొనసాగించే సౌకర్యం కలగనుంది. ఇక బజాబ్ సంస్థ వర్గాలు తెలిపినట్లు ఈ క్యూటోలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారితే.. అటోల చార్జీలో సగంధరకే ప్రయణించే అవకాశం ప్రయాణికుల సోంతం కానుంది. ఇందుకోసం బజాబ్ అటో - ఉబర్ సంస్థలు సంయుక్తంగా కలసి హైద్రబాద్ లో ప్రయాణికుల రవాణా కోసం సరికొత్త సర్వీసును తీసుకురానున్నాయి. ఇంతకీ బజాబ్ క్యూట్ అంటే ఏమిటీ.. అన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే..

బజాజ్ ఆటో క్యూట్ పేరుతో క్వాడ్రి సైకిల్ ని రూపొందించింది. డ్రైవరుతో కలిసి నలుగురు మాత్రమే ప్రయాణించగలిగే సామర్థ్యం వున్న ఈ బుల్లికారులో ఆటో కంటే సౌకర్యవంతంగా సిటీలో గమ్యస్ధానాలకు చేరేందుకు వీలుంటుంది. నాలుగు చక్రాలతో నడిచే ఈ క్వాడ్రి కారును బజాజ్ చాలా కాలం క్రితమే తయారు చేసింది. కొన్నాళ్ల పాటు ఈ క్వాడ్రీసైకిల్ ను కేంద్ర రవాణ శాఖ పరిశీలన జరిపి దీనిని కేవలం టాక్సీగా మాత్రమే వినియోగించేందుకు అనుమతులు మంజూరు చేసింది. కాగా ప్రస్తుతం ఉబర్, బజాజ్ లు జతకట్టి బెంగుళూరు నగరంలో ఈ క్యూట్ కారు సేవలను అందిస్తున్నారు.

ఆటో ఛార్జీలకే సౌకర్యవంతంగా గమ్యస్ధానాలకు చేర్చటంతోపాటు, ఇందులో ప్రయాణం భద్రతతో కూడుకున్నదిగా ఉండటంతో బెంగుళూరులో క్యూటో సేవలు విజయవంతం అయ్యాయి. ఈ క్రమంలోనే క్వాడ్రి క్యూట్ కార్ల తయారీపై బజాజ్ సంస్ధ దృష్టిపెట్టింది. ఉబర్ సంస్ధ ఆధ్వర్యంలో ఈ ఏడాది చివరి నాటికి హైద్రాబాద్ నగరంలో సైతం ఈ క్యూట్ కారు సర్వీసులు ప్రారంభంకానున్నాయి. అతితక్కువ ఛార్జీలతోపాటు, సౌకర్యవంతమైన ప్రయాణం ఈ క్వాడ్రి క్యూట్ కారులో ఉండటంతో తప్పకుండా ప్రయాణికులు ఆదరిస్తారని బజాజ్, ఉబర్ సంస్ధలు బావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajaj Auto  Bajaj Qute  quadricycle  Uber  Bengaluru  Hyderabad  commercial purposes (taxi)  Auto  Business  Technology  

Other Articles