Airtel Rs. 558 Prepaid Recharge Plan Revised ఎయిర్ టెల్ న్యూఇయర్ ‘గిప్ట్’.. ప్లాన్ వ్యాలిడిటీ కుదింపు.!

Airtel rs 558 prepaid recharge validity reduced to 56 days

airtel, airtel plan, airtel recharge, airtel rs 558, airtel data pack, airtel plan validity, airtel rs 558 plan validity, business, telcom industry, Trai

Airtel has revised its Rs. 558 prepaid recharge plan to reduce the validity by 26 days. Now, in the case of the Rs. 558 prepaid recharge plan, the validity has been reduced, but all the other benefits remain same.

ఎయిర్ టెల్ న్యూఇయర్ ‘గిప్ట్’.. ప్లాన్ వ్యాలిడిటీ కుదింపు.!

Posted: 12/27/2019 06:32 PM IST
Airtel rs 558 prepaid recharge validity reduced to 56 days

జీయో ఎంట్రీతో టెలికాం రారాజుగా వున్నభారతి ఎయిర్ టెల్‌ క్రమంగా తన ఆదిపత్యానికి చేజార్చుకుంది. దీంతో నెల రోజుల క్రితం మార్కెట్ లో వుండాలంటే.. చార్జీలు పెంచక తప్పదన్న నిర్ణయానికి వచ్చింది. ఇదే సమయంలో తమ వినియోగదారులకు మరోసారి న్యూఇయర్ షాకిచ్చింది. వినియోగదారులు అధికంగా ఆకర్షితులవుతున్న తన రూ.558 ప్లాన్‌లో భారీ మార్పు చేసింది. ఈ ప్లాన్ పై ఇస్తున్న గడువును ముఫైశాతానికి పైగానే కోతపెడుతూ న్యూఇయర్ గిప్ట్ అందించింది. మిగిలిన వాటిని యథాతథంగా ఉంచింది.

ఇటీవల ప్లాన్‌ ధరలను భారీగా పెంచిన భారతి ఎయిర్ టెల్ సంస్థ నెల రోజులు కూడా తిరగక ముందే అధికశాతం మద్యతరగతి కస్టమర్లు అకర్షితులైన ప్లాన్ లో భారీ కోత విధించడం గమనార్హం. ఏకంగా ఈ ప్లాన్ లో 26 రోజుల వ్యాలిడీటీని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ టెల్‌ రూ.558 ప్లాన్‌ కింద అన్ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ లభిస్తున్నాయి. రోజుకు 3జీబీ డేటా, 100 ఎమ్మెస్ లు చొప్పున లభిస్తాయి. అయితే 82 రోజులుగా ఉన్న కాలపరిమితిని తాజాగా 56 రోజులకు ఎయిర్‌టెల్‌ తగ్గించింది.

దీంతో రూ. 558 ప్లాన్ వ్యాలిడిటీలో 4 వారాల కోత విధించింది. ఇక ఈ ప్లాన్ కింద కింద ఫొటోగ్రఫీ, మ్యూజిక్‌ వంటివి నేర్చుకునేందుకు షా అకాడమీ అందించే నాలుగు వారాల కోర్సును ఉచితంగా అందిస్తున్నారు. వింక్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ ప్రీమియమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. జీ5, హూక్యూ, 370+ లైవ్‌ టీవీ ఛానెల్స్‌, 10వేలకు పైగా చిత్రాలు వీక్షించొచ్చు. దీంతోపాటు ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌ ఈ ప్లాన్‌ కింద ఎయిర్‌టెల్‌ అందిస్తోంది. అన్ని సర్కిళ్లకు ఈ ప్లాన్‌ మార్పులు వర్తిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles