Xiaomi's No 1 Mi Fan sale starts December 19 డిసౌంట్ ధరపై అత్యధిక సేల్ స్మార్ట్ ఫోన్.. రెడ్ మి నోట్ 7ప్రో

Xiaomi announces no 1 mi fan sale with discounts deals

Xiaomi Fan Sale, Redmi Note 7 Pro discount, Redmi Note 7 Pro latest price, Redmi Note 7 Pro mi store offer, Redmi Note 7 Pro Flipkart offer, Redmi Note 7 Pro features, Redmi Note 7 Pro specifications, Redmi Note 7 Pro Flipkart, Redmi Note 7 Pro, discount Price, mi store offer, Flipkart offer, Business, Economy, E-Commerce, Technology

Xiaomi offers first time huge discount on Redmi Note 7 Pro smartphone under Xiaomi Fan sale with an discount of Rs 3,000 on the basic model, the starting price of basic 4 GB, 64 GB is now at Rs 9999

డిసౌంట్ ధరపై అత్యధిక సేల్ స్మార్ట్ ఫోన్.. రెడ్ మి నోట్ 7ప్రో

Posted: 12/19/2019 05:17 PM IST
Xiaomi announces no 1 mi fan sale with discounts deals

భారతీయ మార్కెట్లో 2019లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్లలో షావోమి సంస్థ ఫోన్లు టాప్ ప్లేస్ సాధించాయి. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో సంచలనాలు సృష్టించిన మోడల్స్ లో ఒకటి షావోమీకి చెందిన రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్. షావోమీ అత్యధికంగా అమ్మిన స్మార్ట్ ఫోన్ ఇదేనని రికార్డులు చెబుతున్నాయి. అంతలా యూజర్లను ఆకట్టుకుంది ఈ ఫోన్ పై సంస్థ తాజాగా భారీ డిస్కౌంట్ ధరకు కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ ఫోన్ రిలీజ్ అయినప్పుడు 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.16,999. కానీ ఇప్పుడు ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ను సంస్థ అందిస్తోంది. ఇదివరకు ఒక్కసారి మాత్రమే ధరను తగ్గించింది షావోమీ. అన్ని వేరియంట్లపై రూ.2,000 వరకు తగ్గింపు ప్రకటించింది. మార్కెట్ లోకి ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ కు క్రేజ్ తగ్గలేదు. రెడ్‌మీ నోట్ 8 సిరీస్ వచ్చినా ఈ మోడల్ కు మాత్రం డిమాండ్ అలాగే కొనసాగింది.  
 
తాజాగా 'నెంబర్ 1 ఎంఐ ఫ్యాన్' సేల్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది షావోమీ. మూడు వేరియంట్లపై ఊహించని డిస్కౌంట్ అందిస్తోంది. రెడ్‌మీ నోట్ 7 ప్రో రూ.10,000 లోపు లభించడం ఇదే మొదటిసారి.  ఈ నెంబర్ 1 ఫ్యాన్ లో భాగంగా విక్రయిస్తున్న రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ధర ఏకంగా మూడు వేల రూపాయలు తగ్గింది. బేసిక్ వేరియంట్ పై చూస్తే 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,999. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.14,999.  

షావోమీ ఇండియా ఎంఐ స్టోర్ లో ఈ ఫోన్ కొనేవారికి మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. ఎక్స్‌చేంజ్ లో రెడ్‌మీ నోట్ 7 ప్రో కొంటే అదనంగా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మోడల్ ఇంతగా ప్రాచుర్యం పొందడానికి ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్సే. ఫేస్ అన్‌లాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకలే కారణం. దీనికి తోడు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

48 మెగాపిక్సెల్ కెమెరా తో పాటు మరో 5 మెగాపిక్సల్ కెమెర వెనుక బాగంలో పోందుపర్చిన సంస్థ.. ముందువైపున సెల్సీలు తీసేందుకు వీలుగా 13 మెగాపిక్సల్ కెమారను పొందుపర్చింది. ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 4000 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. త్వరలో ఎంఐయూఐ 11 అప్‌డేట్ రానుంది.  రెడ్‌మీ నోట్ 7 ప్రో నెబ్యులా రెడ్, నెప్‌ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్ ఆస్ట్రో మూన్‌లైట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles