Construction, property industries in trouble: Rajan దేశ అర్థిక పరిస్థితిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

Deep malaise in indian economy says former rbi governor

raghuram rajan, nbfc crisis, asset quality review, stressed assets, realty sector, reserve bank of india, india gdp growth, shaktikanta das, nbfcs, Economy Policy, Economy, Growth rate, Growth slowdown, Financial year 2020, Financial year 2020 growth slowdown, business

India’s real estate, construction and infrastructure industries are in “deep trouble,” and non-bank finance companies which lend to these sectors should have their asset quality reviewed, former central bank Governor Raghuram Rajan said.

దేశ అర్థిక పరిస్థితిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ కీలక వ్యాఖ్యలు

Posted: 12/07/2019 07:18 PM IST
Deep malaise in indian economy says former rbi governor

ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్‌ దేశ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే ఆయన దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోనున్నాయని హెచ్చరించారు. పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని తెలిపారు. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగిత రేటు తీవ్ర స్థాయిలో ఉందని తెలిపారు.

రియల్టీ, కన్‌స్ట్రక్షన్‌, మాన్యుఫాక్చర్‌  కంపెనీలకు పెద్దమొత్తంలో రుణాలిచ్చే ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యతను పరిశీలించాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర బ్యాంకు టాప్‌ 50 నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల పనితీరును సమీక్షిస్తుందన్న ఆయన ఆర్బీఐ వాటి పనితీరును, వాటి ఎసెట్‌ క్వాలిటీని కూడా సమీక్షించాలని సూచించారు.  

కాగా నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని సుమారు యూఎస్‌డీ 66 బిలియన్ల మేర బకాయిలు ఉన్నటు ఇటీవల ఓ సర్వే తెలియజేసిందని పేర్కొన్నారు. మరోవైపు ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ స్పందిస్తూ సుమారు 4.54 లక్షల యూనిట్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి కావడం లేదని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles