హువావే కంపెనీ నుంచి హానర్ 20i కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నాం 12 గంటల నుంచి ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫాంపై అందుబాటులో ఉంటుంది. హానర్ 20 సిరీస్ ను ఇండియాలో గతవారమే హువేవా కంపెనీ లాంచ్ చేసింది. ఈ హానర్ 20 సిరీస్ మోడల్ ఫోన్లు బ్రిక్ అండ్ మోర్తార్ ఆన్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
హానర్ మోడల్ ఫోన్లు ఆఫ్ లైన్ స్టోర్లలో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయో ఖచ్చితమైన తేదీని ఇప్పటికీ ప్రకటించలేదు. హానర్ 20i స్మార్ట్ ఫోన్ లో ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. 6.2 అంగుళాల Full HD+ స్క్రీన్, అక్టా-కోర్ కిరిన్ 710F SoC, ట్రిపుల్ రియర్ కెమెరాలు, 3,4000mAh బ్యాటరీ సపోర్ట్ ఉంది. హానర్ 20 సిరీస్ ఫోన్లు, హానర్ 20 ఫోన్లు జూన్ 25న రిలీజ్ కానున్నాయి.
లాంచింగ్ ఆఫర్లు :
ఇండియాలో హానర్ 20i ఫోన్ ధరను రూ.14వేల 999గా నిర్ణయించారు. సోల్ వేరియంట్ (4GB ర్యామ్, 128GB ఆన్ బోర్డ్ స్టోరేజీ)తో అందుబాటులో ఉంది. హానర్ కంపెనీ ఆఫర్ చేస్తున్న హానర్ 20i స్మార్ట్ ఫోన్.. ఫ్యాంటమ్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ కలర్లలో లభ్యం అవుతోంది. హానర్ 20i ఫోన్ లాంచింగ్ ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తోంది.
హానర్ 20i కొనుగోలు దారులు నో కాస్ట్ EMI ఆఫర్ పొందవచ్చు. దీని ద్వారా నెలకు రూ.2వేల 500 నుంచి ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా హానర్ 20i యూజర్లు.. రూ.2200 క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. 125GB వరకు అదనంగా 4G డేటాను రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్లు రూ.198 లేదా రూ.299 ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.
హానర్ 20i ఫీచర్లు- స్పెషిఫికేషన్లు ఇవే :
* 6.2 అంగుళాల ఫుల్ HD+ (1080x2340) ఫిక్సల్స్ డిస్ ప్లే, 19:5:9 అస్పెక్ట్ రేషియో
* డ్యుయల్ సిమ్ (Nano)
* ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
* 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీ
* 24మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, f/1.8 లెన్స్
* 8మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, f/2.4 లెన్స్
* 2మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్, f/2.4 లెన్స్
* ఫ్రంట్.. 32మెగా పిక్సెల్ కెమెరా, f/2.0 లెన్స్
* ఆండ్రాయిడ్ 9 పై, EMUI 9.0.1 టాప్
* అక్టా కోర్ కిరిన్ 710F SoC
* 4G LTE సపోర్ట్
* వై-ఫై 802.11 a/b/g/n/ac
* బ్లూ టూత్ 4.2 వెర్షన్
* మెయిల్ జీ51 MP4 GPU
* 3400mAh బ్యాటరీ
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more