Tata Motors phasing out small diesel cars డీజిల్ చిన్నకార్లకు.. టాటా గుడ్ బై..

After maruti suzuki tata motors planning to discontinue small diesel cars

Tata, Tata Motors, Tata cars, Tata cars in India, Tata diesel cars, Tata diesel cars in India, Tata diesel cars discontinued, Tata Tiago, Tata Tigor, Tata Bolt, Tata Zest, BS 6, BS VI, emission norms, emission norms in India, air pollution in India, Bharat Stage, Bharat Stage 6, Bharat Stage VI, Maruti Suzuki diesel cars discontinued, diesel cars, diesel cars India, diesel cars in India, e-commerce, cars, technology, business

Tata Motors may tread in Maruti Suzuki's footsteps and discontinue small diesel cars from its With demand for diesel cars expected to decline in the face of upcoming BS-VI norms, a senior official said manufacturing diesel cars in India will be a costly affair.

మారుతి బాటలోనే టాటా.. డీజిల్ చిన్నకార్లకు గుడ్ బై..

Posted: 05/06/2019 09:36 PM IST
After maruti suzuki tata motors planning to discontinue small diesel cars

వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ కూడా మారుతిసుజుకీ బాటలోనే నడుస్తోంది. దశలవారీగా డీజిల్‌  చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమవుతోంది. త్వరలో అమల్లోకి రానున్న బీఎస్‌-6 ఉద్గార నిబంధనల కారణంగా వీటి ధరలు పెరుగుతాయని, ఫలితంగా గిరాకీ మందగించొచ్చని అంచనా వేస్తోంది. ఈ కారణంగానే ఈ కార్లను తయారీ చేయడం భారంగా మారుతుందని టాటా మోటార్స్‌ అధ్యక్షుడు (ప్రయాణికుల వాహన విభాగం) మయాంక్‌ పరీఖ్‌ వెల్లడించారు.

ప్రస్తుతం టాటా మోటార్స్‌ హ్యాచ్‌ బ్యాక్‌ టియాగో, కాంపాక్ట్‌ సెడాన్‌ టిగోర్‌, బోల్ట్‌, జెస్ట్‌ వంటి చిన్నకార్లను డీజిల్‌ ఇంజిన్లతో విక్రయిస్తోంది. చిన్నకార్ల విభాగంలో 80 శాతం గిరాకీ పెట్రోల్‌ వేరియంట్లకే లభిస్తోందని, అందుకే డీజిల్‌లో చిన్నకార్లపై అదనపు పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదని పరీఖ్‌ అన్నారు. కాగా, ఇప్పటికే మారుతిసుజుకీ కూడా డీజిల్ కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ కూడా బీఎస్-6 ఉద్గార నిబంధనలనే కారణంగా చూపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tata Motors  diessel cars  air pollution  Maruti Suzuki  technology  business  

Other Articles