Jio GigaFiber broadband services from August 15 పంద్రాగస్టు నుంచి జియో గిగా ఫైబర్ సేవలు ప్రారంభం..

Jio gigafiber announced for 1100 cities registrations begin august 15

jio, jio fiber, jio gigafiber, jio gigafiber launch, reliance jio gigafiber, reliance jio fiber launch, reliance jio gigafiber price, jio gigafiber plans, jio gigafiber registration

Jio GigaFiber: Jio says that the services will be available to the users within an hour, which means that the Jio engineers will arrive at your doorstep at set up the connection

పంద్రాగస్టు నుంచి జియో గిగా ఫైబర్ సేవలు ప్రారంభం..

Posted: 07/05/2018 12:05 PM IST
Jio gigafiber announced for 1100 cities registrations begin august 15

ఒక సెకనుకు గిగాబైట్ల వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలను రిలయన్స్ సంస్థ తమ బ్రాడ్ బ్యాండ్ భారతీయులకు అందుబాటులోకి తీసుకురానుందని రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. సంస్థ 44వ వార్షికోత్సవంలో మాట్లాడిన ఆయన, ఫైబర్ గ్రిడ్ అందుబాటులోకి వచ్చిన తరువాత విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, ఆ ఫలాలను భారతీయులకు అందిస్తామని తెలిపారు. ఇండియా నుంచి వెళ్లే ఎగుమతుల్లో రిలయన్స్ కు 8.9 శాతం వాటా ఉందని చెప్పిన ముఖేష్, జియో రాకతో ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సేవలు దగ్గరయ్యాయని అన్నారు.

సరికొత్త సేవలు ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఫిక్సెడ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ పై విస్తరించనున్నామని అంబానీ తెలిపారు. ఈ మేరకు తమ బ్యాండ్ బ్యాండ్ పేరును కూడా ది జియో గిగా ఫైబర్ గా ప్రకటించారు. ఈ ఫైబర్ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ సొల్యూషన్స్ ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. ఇది అందుబాటులోకి వస్తే, అల్ట్రా హై డెఫినిషన్, మల్టీ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలను ఇంటి వద్ద పొందవచ్చని తెలిపారు. తన యజమాని ఇచ్చే ప్రతి కమాండ్ ను అర్థం చేసుకునేలా వాయిస్ యాక్టివేటెడ్ వర్చ్యువల్ అసిస్టెన్స్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.

ఇక వాణిజ్యపరంగా ఇది ఇతోధిక అభివృధ్దికి దోహదపడుతుందని డిజిటల్ షాపింగ్ దగ్గరవుతుందని, ప్రతి ఇల్లూ స్మార్ట్ హోమ్ గా మారుతుందని, సీసీ కెమెరాల నుంచి, గృహోపకరణాల వరకూ చూపుడు వేలు, నోటి మాట ద్వారా నియంత్రణలో ఉంటాయని అన్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మరే దేశంలో ఉన్నా, తన స్మార్ట్ ఫోన్ నుంచి ఇంటిని నియంత్రణలో ఉంచుకోవచ్చని ముఖేష్ తెలిపారు. ప్రస్తుతం ఫిక్సెడ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ విస్తరణలో భారత స్థానం 134గా ఉందని గుర్తు చేసిన ఆయన, ఏడాది వ్యవధిలోనే టాప్ 100 లోపలికి చేరుతుందని అన్నారు.

డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు అవసరమైన పెట్టుబడులను పెడుతున్నామని, ఇప్పటికే రూ. 250 కోట్లను వెచ్చించామని వెల్లడించారు. ఫైబర్ కనెక్టివిటీని ఇళ్లకు, చిన్న మధ్య తరహా కంపెనీలకు అందించేందుకు కృషి చేస్తున్నామని, త్వరలోనే 1,100 నగరాలు, పట్టణాల్లో సేవలను ప్రారంభిస్తారని చెప్పారు. వ్యాపారస్తుల కోసం క్లౌడ్ అప్లికేషన్స్, మరింత వేగంగా పనిచేసే బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తామని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇండియాలో ఉద్యోగ సృష్టికి రిలయన్స్ తనవంతు సహకారాన్ని అందిస్తోందని ఆయన చెప్పారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ గోల్డెన్ డికేడ్ ఈ సంవత్సరం నుంచి మొదలైందని సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ముంబైలో సంస్థ ఏజీఎంలో మాట్లాడిన ఆయన, ఇప్పటి వరకూ చవిచూసిన లాభాలు ఒక ఎత్తయితే, ఇకపై కళ్లజూడనున్న లాభాలు మరింతగా ఉంటాయని అన్నారు. నాలుగు దశాబ్దాల తరువాత, ఐదో దశాబ్దంలోకి సంస్థ అడుగు పెట్టిందన్న విషయాన్ని ముఖేష్ గుర్తు చేశారు. గత సంవత్సరం రిలయన్స్ నికర లాభం 20.6 శాతం పెరిగి రూ. 36,075 కోట్లకు చేరిందని అన్నారు. ఈ లాభాల్లో హైడ్రో కార్బన్ విభాగం పనితీరును మరువలేనని ముఖేష్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles