Rupee hits record low of 69.01 against US dollar పతనంలో చరిత్ర.. విలువ తగ్గిన రూపాయి

Rupee crashes to lifetime low of 69 against us dollar

samsung, mobiles, Amazon.in, Airtel, samsung happy hours, samsung Galaxy J2, samsung Galaxy J7 Pro, samsung Galaxy J7 Prime, samsung Galaxy J5 Prime, ICICI bank, e-commerce, smart phones, mobiles, technology, business

After opening at all-time low the Indian rupee fell further and break the important level of 69 per dollar mark. The dollar's sharp gain overnight coupled with falls in Asian peers caused the drop in early trade.

పతనంలో చరిత్ర.. విలువ తగ్గిన రూపాయి

Posted: 06/28/2018 05:59 PM IST
Rupee crashes to lifetime low of 69 against us dollar

ప్రధాని మోడీ ప్రభుత్వంలో రూపాయి కొత్త చరిత్ర సృష్టించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌తో రూపాయి విలువ 69కన్నా ఎక్కువకు పడిపోయింది. ఆర్ బీఐ రిఫరెన్స్‌ రేటు 68.52 కాగా, ఇవాళ ఉదయం ఫారెక్స్‌ మార్కెట్‌(విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌) ప్రారంభమైన కొద్దిసేపటికే 69కి పతనమైంది. ఇరాన్‌ నుంచి ముడి చమురు కొనుగోలు చేయరాదన్న అమెరికా ఆంక్షలతో ముందస్తు కాంట్రాక్టుల ప్రీమియం ఒక్కసారిగా మారిపోయింది. అలాగే నెలాఖరులో ఆయిల్‌ కంపెనీల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో రూపాయి భారీగా పతనమైంది.

స్పాట్‌ మార్కెట్‌లో డాలర్‌కు రూపాయి విలువ 69కి పడిపోగా, ఫ్యూచర్స్ మార్కెట్‌లో జులై కాంట్రాక్ట్‌ 69.3175 వద్ద, ఆగస్టు కాంట్రాక్ట్‌ 69.5950 వద్ద ట్రేడవుతున్నాయి. గత కొన్ని నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్‌లో భారీగా అమ్మకాలు చేసి... నిధులను సొంత దేశాలకు తరలిస్తున్నారు. దీంతో డాలర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం, మోడీ ప్రాభవం తగ్గడంతో భారత మార్కెట్‌లోకి విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళు బాగా తగ్గాయి. దీంతో మున్ముందు రూపాయి 70కి మించి పడిపోతుందని ఫారెక్స్‌ మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rupee exchange rate  INR USD  Rupee  Indian Rupee  rupee  dollar  USD  INR  Forex  economy  business  

Other Articles