Coolpad 'Note 6' launched in India సరికొత్త ఫీచర్లతో కూల్ ప్యాడ్ నోట్ 6 స్మార్ట్‌ఫోన్‌ విడుదల

Coolpad note 6 with dual selfie cameras launched in india

coolpad note 6, launch, china handset maker, new features, new model smart phone, retail stores, e-commerce, smart phones, mobiles, technology, business

Chinese handset maker Coolpad launched "Note 6" as its offline exclusive product in India with 5.5-inch HD display and 8MP+5MP dual front cameras.

సరికొత్త ఫీచర్లతో కూల్ ప్యాడ్ నోట్ 6 స్మార్ట్‌ఫోన్‌ విడుదల

Posted: 05/01/2018 07:34 PM IST
Coolpad note 6 with dual selfie cameras launched in india

స్మార్ట్ ఫోన్ ప్రియులను అకర్షించడంలో ఇటు మోమైల్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థల మధ్య కూడా విపరీతమైన పోటీ నెలకొంది, ఒక సంస్థ ఏదైనా కొత్త ఫీచర్ ను రూపోదించిన క్రమంలో అదే ఫీచర్ ను తమ స్మార్ట్ ఫోన్లో పొందుపర్చడంతో పాటు మరో కొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చి స్మార్ట్ ఫోన్ ప్రేమికులను అకర్షించడానికి సంస్థలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇక తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ కూల్ ప్యాడ్ సరికొత్త నోట్ 6 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారత విఫణిలోకి ఇవాళ దానిని విడుదల చేసింది. డ్యూయల్ సెల్ఫీ కెమెరా గల కూల్‌ప్యాడ్ నోట్ 6 స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ ప్రకటించింది.

కూల్‌ప్యాడ్ నోట్ 6 స్మార్ట్ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 8,999లకే లభిస్తుందని సంస్థ వెల్లడించింది. కూల్ ప్యాడ్ నోట్ 6 స్మార్ట్ ఫోన్ గోల్డ్, గ్రే రంగుల్లో ఉంటుందని, మే 1వ తేదీ నుంచి ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. ఇండియాలో 300 మల్టీబ్రాండ్ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని కూల్‌ప్యాడ్ వెల్లడించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్, హర్యానా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయని కంపెనీ స్పష్టం చేసింది. 32జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 8,999, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ గల ఈ స్మార్ట్‌ఫోన్లు రూ. 9,999 లభిస్తోందని కంపెనీ తెలిపింది.
 
కూల్‌ప్యాడ్ నోట్ 6 ఫీచర్లు:-
* ఆండ్రాయిడ్ 7.1 నాగాట్,
* 5.5 అంగుళాల పూర్తి హెచ్‌డీ 1080-1920 పిక్సెల్ డిస్‌ప్లే,
* స్నాప్‌డ్రాగన్ 435 ఎస్‌వోసీ,
* 4జీబీ ర్యామ్,
* డ్యూయల్ కెమెరా సెటప్,
* 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా,
* 5 మెగాపిక్సెల్ సెకండ్ సెన్సార్ కెమెరా,
* 13 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరా,
* 128 మైక్రో ఎస్డీ కార్డు ఈ ఫోన్‌కు ఉంటాయని సంస్థ తెలిపింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coolpad note 6  retail stores  e-commerce  smart phones  mobiles  technology  business  

Other Articles