అమ్మకాలు అదే పనిగా సాగితే.. సదరు ఉత్సత్తులపై ధరలను అమాంతం పెంచడం వ్యాపార రహస్యమేనన్న విషయం ఓపెన్ సీక్రెట్టే. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం తన ఉత్సాదనలతో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంటున్న చైనాకు చెందిన షియోమి.. తన బేసిక్ మోడల్ స్మార్ట్ ఫోన్ ధరను కూడా పెంచేసింది. స్మార్ట్ ఫోన్ ను మరింత మందికి చేరువ చేసే ఉద్దేశంతో అతి తక్కువ ధరకు చక్కటి ఫీచర్లతో షియోమి రెడ్‌మి 5ఏను గతేడాది నవంబర్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.5,999గా నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్, మేకిన్ ఇండియా కార్యక్రమం కింద 50లక్షల ఫోన్లపై రూ.1000 తగ్గించి రూ.4,999కు అందించనున్నట్లు తెలిపింది.
కాగా, తాజాగా 50లక్షల ఫోన్లు విక్రయమవడంతో తగ్గింపు ధర రూ.1,000 తీసివేసింది. ఇక నుంచి ఈ ఫోన్ రూ.5,999 లభించనున్నట్లు వెల్లడించింది. విడుదల చేసిన ఒక నెలరోజులలోపే 1 మిలియన్ యూనిట్లకు పైగా విక్రయించినట్లు షియోమి తెలిపింది. షియోమి రెడ్‌మి5ఏ రెండు వేరియంట్లలో భారత్‌లో లభిస్తోంది. 2జీబీ ర్యామ్/16జీబీ స్టోరేజ్ రూ.5,999 కాగా, 3జీబీ/32జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.6,999గా నిర్ణయించింది. స్టాండ్ బై మోడ్‌లో ఎనిమిదిరోజుల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని తెలిపింది. మరోపక్క మార్చి 14న రెడ్‌మి 5ను విడుదల చేసేందుకు షియోమి సన్నాహాలు చేస్తోంది.
రెడ్ ఎంఐ 5ఏ ఫీచర్లు
* 5 అంగుళాల తాకే తెర
* స్నాప్ డ్రాగన్ 425
* 2జీబీ ర్యామ్ /16జీబీ స్టోరేజ్, 3జీబీ/32జీబీ స్టోరేజ్
* 13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
* 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా
* 3000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more